ఈమధ్యన టాలీవుడ్ లో కాపీ కంటెంట్ ఎక్కువగా కనబడుతుంది. ఏ సినిమా ట్రైలర్ వదిలినా వేంటనే అది ఏ హాలీవుడ్ సినిమా కాపీనో... లేదంటే ఏ ఇతర భాష సినిమా కాపీనో అంటూ సోషల్ ఇండియాలో న్యూస్ రావడం సినిమా విడుదలయ్యాక అది కాస్తా నిజమని తేలిపోవడం జరుగుతూనే ఉంటున్నాయి. ఇదివరకే రీమేక్ రైట్స్ కొనుక్కుని సినిమాలు రీమేక్ చేసేవారు. కానీ ఈమధ్యన టాప్ డైరెక్టర్స్ సైతం ఇతర భాషా సినిమా కథలను కాపీ చేసి అడ్డంగా బుక్ అవుతున్నారు. మరి చిన్నా లేదు పెద్దా లేదు... ఏ సినిమాలో అయినా ఏదో ఒక సినిమా నుండి ఇన్స్పైర్ అయ్యో... లేదంటే కాపీ కొట్టిపడేసో సినిమాలు తీస్తున్నారు. ఆనక చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారు.
అయితే ఇంకా ఫస్ట్ లుక్ లు కూడా విడుదలకాని రెండు సినిమాల స్టోరీ లైన్స్ ఒకేలా ఉన్నాయంటూ ప్రచారం మొదలయింది. మహానుభావుడు హిట్ తర్వాత హీరో శర్వానంద్ హను రాఘవపూడి దర్శకత్వంలో పడి పడి లేచే మనసు అనే లవ్ స్టోరీ లో నటిస్తున్నాడు. అలాగే సాయి ధరమ్ తేజ్ వరుస ప్లాపుల్లో ఉన్నాడు. ప్రస్తుతం కరుణాకరన్ తో ఒక మూవీ, ఇంకా మరో రెండు మూవీస్ ని కూడా లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ స్టోరీ లైన్, శర్వానంద్ పడి పడి లేచే మనసు స్టోరీ లైన్ ఒక్కటే అన్నట్టుగా టాక్ వినబడుతుంది. మరి రెండు ప్రేమ కథ చిత్రాలే కావడం వలన ఇలాంటి టాక్ వినబడుతుందో... లేదో తెలియదు కానీ... ఈ న్యూస్ మాత్రం సోషల్ మీడియా లో తెగ హల్చల్ చేస్తుంది.
అయితే రెండు సినిమాల స్టోరీ లైన్స్ ఒకటే అని ప్రచారం జరుగుతున్నదాన్ని బట్టి... రెండు సినిమాల్లోనూ హీరోయిన్ కు చిన్న షార్ట్ టెర్మ్ మెమరీ లాస్ లాంటి సమస్య ఏదో వుండడం... దానివల్ల తన ప్రేమను ఎప్పటికప్పుడు మర్చిపోవడం అన్నది లైన్ గా వినబడుతుంది. మరి ఇలా రెండు సినిమాల కథలకు దగ్గర పోలికలుంటే ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు గాని... గతంలోని అఖిల్ హలో సినిమాకి, రెండు రెళ్ళు ఆరు సినిమా కథ కి దగ్గర పోలికలున్నాయంటూ కొన్ని వార్తలు హల్చల్ చేశాయి. కానీ హలో సినిమా విడుదలయ్యాక అది నిజం కాదని తేలిపోయింది.