Advertisementt

విమర్శలకు కేంద్రంగా నిలుస్తోన్న 'రంగస్థలం'!

Tue 17th Apr 2018 03:16 PM
pawan kalyan,rangasthalam,controversy,mythri movie makers,ram charan  విమర్శలకు కేంద్రంగా నిలుస్తోన్న 'రంగస్థలం'!
Controversies on Ram Charan Rangasthalam విమర్శలకు కేంద్రంగా నిలుస్తోన్న 'రంగస్థలం'!
Advertisement
Ads by CJ

'రంగస్థలం' చిత్రం ద్వారా రామ్‌చరణ్‌ తన తండ్రి చిరంజీవి నటించిన 'ఖైదీనెంబర్‌ 150' కలెక్షన్లను కూడా దాటుతున్నాడు. ఇక ఓవర్‌సీస్‌లో కూడా ఈచిత్రం దాదాపు 3.3 మిలియన్లకు దరిదాపుల్లో ఉంది. ఏవిధంగా చూసుకున్నా 'రంగస్థలం' చిత్రం టాలీవుడ్‌కి ఈ ఏడాది వచ్చిన మొదట బ్లాక్‌బస్టర్‌ మూవీగా అందరు ఏకాభిప్రాయంగా చెబుతారు. ఈ చిత్రం నాన్‌బాహుబలి రికార్డులను బద్దలు కొట్టి, 'మగధీర' తర్వాత రామ్‌చరణ్‌కి వచ్చిన బిగ్గెస్ట్‌ హిట్‌ అనడంలో సందేహం లేదు. కానీ ఈ చిత్రం విషయంలో నిన్న పవన్‌ చేసిన వ్యాఖ్యలు, పక్కరోజు 'రంగస్థలం' నిర్మాతలు పత్రికలకు ఇచ్చిన యాడ్స్‌పై మాత్రం విమర్శల వర్షం కురుస్తోంది. తెలుగు వరకు చెప్పుకుంటే 'రంగస్థలం' చిత్రం గొప్ప చిత్రమే. కాదనలేం. 

కానీ ఇది ఏకంగా ఆస్కార్‌కి పోటీ పడే చిత్రంగా పవన్‌కళ్యాణ్‌ పేర్కొనడం మాత్రం హాస్యాస్పదం. బాలతో పాటు కె.విశ్వనాథ్‌, దాసరి, మణిరత్నం, కె.బాలచందర్‌, సింగీతం శ్రీనివాసరావు వంటి దిగ్గజాలు తీసిన చిత్రాలు, ఇక తమిళంలో ఇలాంటి పక్కా 'రా' చిత్రాలకు కొదువలేదు. చివరకు కమల్‌హాసన్‌ 'నాయకుడు'కి కూడా ఆస్కార్‌ రాకపోతే కమల్‌హాసన్‌ తన వరకు ఆస్కార్‌పై తనకి మోజు లేదని, వారి దృష్టిలో అది గొప్ప అవార్డు అయి ఉండవచ్చు. కానీ భారతీయ చిత్రాలకు జాతీయ అవార్డులనే నేను ప్రామాణికంగా తీసుకుంటాను. ఆస్కార్‌ రాలేదని నేను ఏనాడు బాధపడలేదు అని చెప్పాడు. ఇక తాజాగా 'రంగస్థలం' నిర్మాతలు ఇచ్చిన పలు ప్రకటనల్లో బిగ్గెస్ట్‌ హిట్‌ ఇన్‌ టాలీవుడ్‌ ఫిలిం ఇండస్ట్రీ అని వేసి 175కోట్లు గ్రాస్‌ని వసూలు చేసిందని గర్వంగా చెప్పారు. దీనితో ఎవరికి విబేధాలు లేకపోయినా నాన్‌-బాహుబలి రికార్డుగా మాత్రమే దీనిని చెప్పి ఉంటే వివాదాలకు తావుండేది కాదు. ఎక్కడో కింద చిన్నగా వివరణ ఇచ్చి ఇలా టాలీవుడ్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా పేర్కొనడంపై మాత్రం విమర్శలు వస్తున్నాయి. 

ఒక వైపు పవన్‌ ఆస్కార్‌ అని చెప్పిన జోక్‌కే అందరు నవ్వుకుంటూ ఉంటే.. ఇప్పుడు ఈ కొత్తగా బిగ్గెస్ట్‌ హిట్‌ అనే పదంపై కూడా విమర్శలు చెలరేగుతున్నాయి. మొత్తానికి ఇదంతా పవన్‌, నిర్మాతల అతి వల్లనే నవ్వుల పాలు కావడం జరిగిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఈ చిత్రం 200కోట్ల క్లబ్‌లో స్థానం సంపాదించడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది...! 

Controversies on Ram Charan Rangasthalam:

Pawan Kalyan Wants Oscar to Rangasthalam Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ