పవన్ ఫ్యాన్స్, కత్తి మహేష్‌ల గొడవలోకి ఎంటరై కత్తి మహేష్ చేత నిద్రపోతున్న గాడిదను లేపి తన్నించుకున్నట్లుగా పూనమ్‌కౌర్ మధ్యలో ఎంటరై పబ్లిసిటీ వస్తుందని భావిస్తే, అది బెడిసి కొట్టి ఆమెకే ఎదురు తిట్లు తగిలాయి. ఇక ఈమె సినిమాలలో లాభం లేదని తాజాగా 'బాహుబలి' వంటి చిత్రాన్ని నిర్మించిన ఆర్కామీడియా సంస్థ నిర్మిస్తున్న 'స్వర్ణఖడ్గం' ద్వారా బుల్లితెరకు వస్తోంది. ఇక తాజాగా ఈమె కాస్టింగ్‌కౌచ్ గురించి స్పందించింది. ఎవరైనా అమ్మాయి కష్టాలలో ఉన్నానని చెప్పినా, లేదా అవకాశాల కోసం ఎదురుచూస్తున్నా, వారిని వాడుకోవాలని అనుకునే వారే సమాజంలో ఎక్కువగా ఉన్నారు. నాకూ ఈ పరిస్థితి ఎదురైంది. ఏదో అయిపోయిందని నేనేమీ చెప్పుకోను. సమయం అనుకూలంగా లేదని భావిస్తే, ఎలా బయటపడాలో ఆలోచించి, ఆ పరిస్థితులకు తగ్గట్లు నడుచుకుంటాను. నాకు ఓపిక ఎక్కువ, ఎవరికి నష్టం చేసే మనస్తత్వం నాకు లేదు. నా చుట్టు ఏమి జరుగుతున్నదనే విషయం నాకు తెలుసు.
ఓ అమ్మాయి ఎంతగా బాధపడితే తనకు జరిగిన అన్యాయాన్ని నలుగురిలో చెప్పుకునేందుకు ముందుకు వస్తుందో అర్ధం చేసుకోవాలి. నేను మాత్రం అంత బలహీనురాలిని కాను. నేను చేయగలిగింది చేస్తా. భయపెట్టే వ్యక్తి ఏమి చేయగలడో ఎదురు నిలబడి చూస్తాను. ధైర్యంగా ఉండటం అంటే నాకెంతో ఇష్టం అని చెప్పుకొచ్చింది. మొత్తానికి శ్రీరెడ్డి ఉదంతాన్ని ఉదాహరణగా చూపిస్తూ ఈమె కూడా తనదైన శైలిలో వివరణ ఇచ్చింది. మరి ఈమెకి ఆశించిన పబ్లిసిటీ వస్తుందా? లేదా? అనేది చూడాలి. ఇక సిని పరిశ్రమలోని అపూర్వ వంటి వారు శ్రీరెడ్డికి అండగా నిలుస్తూ ఉంటే, హేమ, జీవిత వంటి వారు ఇండస్ట్రీలోని అందరు పతివ్రతలు అని చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఇక శృతి అనే క్యారెక్టర్ ఆర్టిస్టు మా అసోసియేషన్‌లో కూడా ఇలాంటి వేధింపులు చేసే వారు ఉన్నారని, మా పెద్దలు కూడా ఇందులో భాగస్వాములేనని తేల్చి చెప్పింది.
దాంతో శ్రీరెడ్డి మా ప్రెసిడెంట్ గారు మీ టోకెన్ నెంబర్ వచ్చింది. మీరు 'మా'లో ఉండటానికి అర్హులు కాదు. ఈ ఆరోపణలకు బయటికి వచ్చి సమాధానం చెప్పండి అని ప్రశ్నించింది. ఇక ఇండస్ట్రీ ఎంతో పవిత్రమైనదని, తనను దేవతలా చూశారని వ్యాఖ్యలు చేసిన జీవిత రాజశేఖర్ తన భర్త వద్దకు అమ్మాయిలను జీవితానే పంపుతుందని, దానికి ఆధారాలు కూడా ఉన్నాయని సామాజిక కార్యకర్త సంధ్య ఆరోపణలు చేయడంతో ఈ వ్యవహారం ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి....!