Advertisementt

రేణు దేశాయ్ ఆవేదన వ్యక్తం చేసింది..!

Wed 18th Apr 2018 05:24 PM
renu desai,kathua,asifa case  రేణు దేశాయ్ ఆవేదన వ్యక్తం చేసింది..!
Renu Desai Reaction On Kathua Asifa Case రేణు దేశాయ్ ఆవేదన వ్యక్తం చేసింది..!
Advertisement
Ads by CJ

ఒకవైపు దేశంలో బాలికలపై, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, మరోవైపు టాలీవుడ్‌లో కాస్టింగ్‌కౌచ్‌పై పలువురు మహిళలు చేస్తోన్నఆరోపణలతో టాలీవుడ్‌ ఇండస్ట్రీ అతలాకుతలం అవుతోంది. ఒక్కసారిగా ఈ కాస్టింగ్‌కౌచ్‌ అనే బెలూను పగలడంతో ఇక పరిస్థితి అదుపు తప్పింది. క్యారెక్టర్‌ ఆర్టిస్టుల నుంచి జూనియర్‌ ఆర్టిస్టుల వరకు పేర్లు పెట్టి మరీ మన నటీమణులు టాప్‌ మేకర్స్‌ పరువు తీస్తున్నారు. ఓ నటి పవన్‌కళ్యాణ్‌ ప్యాకేజీ వీరుడని, ఆయన 200కోట్లతో అమరావతిలో ఇల్లు ఆఫీసు కట్టుకుంటున్నాడని, ఆయనకు మసాజ్‌ చేసేందుకు మాత్రం బెంగాళీ అమ్మాయిలు కావాలని కామెంట్‌ చేసింది. ఇక ఇలాంటి పరిస్థితుల్లోనే దేశంలో జరిగిన జమ్మూకాశ్మీర్‌లోని ఎనిమిదేళ్ల బాలికపై గుడిలో మానభంగం, ఉన్నావో, కథువా ఘటనలపై సామాన్య పౌరులు, సినీ సెలబ్రిటీలు మండిపడుతూ తమదైన ఉద్యమం, నిరసనలను తెలుపుతున్నారు. 

ఇక పవన్‌ ఫ్యాన్స్‌ మొత్తం వదినమ్మ అని పిలిచుకునే పవన్‌ మాజీ భార్య రేణుదేశాయ్‌ కూడా ఉన్నావా, కథువా ఘటనలపై తన గళం విప్పింది. ఆమె ఫేస్‌బుక్‌లో స్పందిస్తూ ఇలాంటి ఘటనలను చూస్తుంటే ఆడపిల్లలుగా వారు పుట్టడమే తప్పా? అని తనకు అనిపిస్తోందని తెలిపింది. ఆసిఫా, నిర్భయ, ఉన్నావో బాధితురాలు పలు వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారు. వయసు రీత్యా, కులాలు, ప్రాంతాల రీత్యా వీరికి ఏమాత్రం సంబంధం లేదు. అయితే బాధితులందరూ మహిళలే కావడం గమనించాల్సిన విషయం. ఇలాంటి ఘటనలు చూస్తుంటే ఆడవారిగా పుట్టడమే వీరు చేసిన పాపమేమో అనిపిస్తోంది. ఇలాంటి ఘటనలు మరలా జరగకుండా ప్రజలను చైతన్యవంతులని చేయాలని ప్రముఖ లాయర్లను, ఓ సామాజిక కార్యకర్తను, పోలీసు ఉన్నతాధికారిని కోరాను. ఇలాంటి దుశ్చర్యలను ఆపాలంటే ఇలాంటి నేరాలు చేసేవారికి భయం పుట్టేలా, వెన్నులో వణుకు పుట్టేలా కఠిన చట్టాలను ప్రభుత్వాలు చేయందే మనం ఎన్ని నిరసనలు చేసినా, ఎన్ని ర్యాలీలు చేసినా ఉపయోగం లేదని వారు అభిప్రాయపడ్డారు. 

ఆడపిల్లలు, పసిపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను మనం రోజూ చూస్తేనే ఉన్నాం. మీడియాలో, చర్చావేదికల్లో, ర్యాలీలలో నిరసన తెలుపుతున్నాం. అయినా ఈ ఘటనలు ఆగడం లేదు. ఎప్పుడైతే ప్రభుత్వాలు కఠిన చట్టాలు చేస్తాయో నాడు మాత్రమే ఇలాంటి ఘటనలకు చరమగీతం పాడగలం. అప్పటి వరకు మన ఆడపిల్లలను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనమీదనే ఉంది. ఎందుకంటే కన్నతండ్రులే కూతుర్లను రేప్‌ చేసిన ఘటనలు మనకి ఉన్నాయి. అందుకే ఆడపిల్లలకు రక్షణనిస్తూ, జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం మనకి ఉందని రేణుదేశాయ్‌ అభిప్రాయ పడింది. 

Renu Desai Reaction On Kathua Asifa Case:

RENU DESAI SENSATIONAL COMMENTS on KATHUA CASE

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ