Advertisementt

శ్రీరెడ్డి పై కళ్యాణి లీక్స్‌ మొదలయ్యాయి!

Sun 22nd Apr 2018 12:35 PM
karate kalyani,sri reddy,daughter,pics,social media  శ్రీరెడ్డి పై కళ్యాణి లీక్స్‌ మొదలయ్యాయి!
Actress karate kalyani leaks on sri reddy శ్రీరెడ్డి పై కళ్యాణి లీక్స్‌ మొదలయ్యాయి!
Advertisement
Ads by CJ

మొత్తానికి శ్రీరెడ్డి తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు సృష్టించిన సంచలనం ఇంకా సమసిపోకపోగా రాను రాను మరింత ముదురుతోంది. ఇందులో శ్రీరెడ్డి విషయంలో కొన్ని పాజిటివ్‌ అంశాలు ఉన్నట్లే పవన్‌పై, ఆయన తల్లిపై శ్రీరెడ్డి చేసిన కామెంట్స్‌ నెగిటివ్‌గా చెప్పుకోవాలి. అయినా శ్రీరెడ్డి పవన్‌ని ఇష్యూలో లాగిన తర్వాత ఈ ఇష్యూ పూర్తిగా పక్కదోవ పట్టింది. ఇప్పుడు శ్రీరెడ్డిని కౌంటర్‌ చేస్తూ పవన్‌ అభిమానులు, మెగాభిమానులందరు ఆమెపై దాడికి దిగుతున్నారు. ఇక శ్రీరెడ్డి విషయంలో మొదటి నుంచి నటి కరాటే కల్యాణి శ్రీరెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ వస్తోంది. 

తాజాగా ఆమె శ్రీరెడ్డి లీక్స్‌లాగానే కళ్యాణి లీక్స్‌ని విడుదల చేస్తున్నానని చెప్పి కొన్ని ఫోటోలను శ్రీరెడ్డి తరహాలోనే పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ఆమె ట్వీట్‌ చేస్తూ శ్రీరెడ్డి అసలు పేరైన విమల అని, ఈమెకి పెళ్లి కాకుండానే అంత పెద్ద కూతురు ఎలా వచ్చింది? ఈమె కూతురు విజయవాడలోని శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్‌ చదువుతోంది. మొన్ననే ఈ చదువు కూడా పూర్తయింది. ఇక శ్రీరెడ్డి అనబడే విమల పదేళ్ల నుంచి తన తల్లిదండ్రులతో తనకి సంబంధాలు లేవని చెబుతోంది. మరి ఆమె కూకట్‌పల్లిలో లోథా మెరిడియన్‌లో కోటిన్నర పెట్టి ప్లాట్‌ని కొనుగోలు చేసింది. ఈ గృహ ప్రవేశానికి ఆమె తల్లి కూడా వచ్చింది. ఖరీదైన కార్లు కొనడానికి, విలాస వంతమైన అపార్ట్‌మెంట్‌లో ప్లాట్‌ కొనడానికి అసలు అవకాశాలే లేవని చెప్పే శ్రీరెడ్డికి ఇంత మొత్తం ఎలా చేకూరుతోంది? ఇంకొన్ని విషయాలను నాకు వీలున్నప్పుడు పోస్ట్‌ చేస్తాను అని తెలిపింది. 

శ్రీరెడ్డి అలియాస్‌ విమల వ్యతిరేకులు మాత్రం ఆమె తెలిపిన సురేష్‌బాబు కుమారుడు అభిరామ్‌, రమేష్‌ పుప్పాల వంటి వారి వద్ద నుంచే ఇంత డబ్బు సొమ్ము చేసుకుందని, వారి ఆర్ధిక సాయంతోనే ఆమె అంతలా ధనవంతురాలి స్థాయికి చేరిందని, అందుకే ఆమె ఈ కేసు విషయంలో అభిరామ్‌తో పాటు ఎవరిపైనైనా పోలీస్‌స్టేషన్‌లో కేసు పెడితే ఇవ్వన్నీ బయటకి వస్తాయనే ఉద్దేశ్యంతోనే కేసు పెట్టడం లేదని అంటున్నారు. ఇక పవన్‌ ఫ్యాన్స్‌ మాత్రం ఆమెని పెద్ద బ్లాక్‌మెయిలర్‌గా పోలుస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Actress karate kalyani leaks on sri reddy:

Karate kalyani Leaks Sri Reddy Daughter Pics In Social Media

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ