సుకుమార్ - రామ్ చరణ్ కాంబోలో వచ్చిన రంగస్థలంతో రామ్ చరణ్ ప్రస్తుత స్టార్ హీరోలకు అందనంత దూరంలోకి వెళ్ళిపోయాడు. రామ్ చరణ్ కి మగధీర సినిమా తర్వాత అన్నీ యావరేజ్ హిట్స్ మాత్రమే పడ్డాయి. కానీ ప్రస్తుతం రామ్ చరణ్ రంగస్థలంతో ఎదురులేని హిట్ కొట్టాడు. అయితే రామ్ చరణ్ కన్నా మెగా హీరోల్లో మరో హీరో అయిన అల్లు అర్జున్ తన సినిమాలతో తనకంటూ ఒక ఇమేజ్ ని సొంతం చేసుకుని తన సినిమాల మార్కెట్ పరిధిని పెంచుకున్నాడు. మెగా ట్యాగ్ నుండి బయటికి రావడానికి చాలానే కృషి చేస్తున్నాడు. తన సినిమాలతో చరణ్ కన్నా ఎక్కువగానే ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తున్నాడు.
కానీ ఎన్ని మెట్లెక్కిన ప్రస్తుతం రామ్ చరణ్ రంగస్థలం రికార్డుని బన్నీ అందుకోవడం సామాన్యమైన విషయం కాదు. రంగస్థలం హిట్ తో రామ్ చరణ్ మాత్రం ప్రస్తుతం అల్లు అర్జున్ అందుకోలేని రేంజ్ లో కెల్లాడు. మరి డీజే సినిమాకి హిట్ టాక్ రాకపోయినా అదరగొట్టే కలెక్షన్స్ ని తన క్రేజ్ తో మూటగట్టుకున్న అల్లు అర్జున్ కి ప్రస్తుతం రంగస్థలం టెంక్షన్ పట్టుకుంది. తాను వక్కంతం వంశి దర్శకత్వంలో చేస్తున్న నా పేరు సూర్య కి ఎంత హిట్ టాక్ వచ్చిన ఖచ్చితంగా రంగస్థలం కలెక్షన్స్ సాధించడం అనేది కల్లే. తన కెరీర్ సాఫీగా సాగుతున్న కూడా ప్రస్తుతం రంగస్థలంతో బాగా ఒత్తిడికి లోనవుతున్నారు అల్లు అర్జున్.
మరి చరణ్ కి యావరేజ్ హిట్స్ పడ్డప్పుడు మెగా ఫ్యాన్స్ కి చిరు, పవన్ తర్వాత బెస్ట్ కింద అల్లు అర్జున్ కనబడేవాడు. మరి అది చరణ్ హిట్ కొట్టనంత వరకే అని రంగస్థలం ప్రూవ్ చేసింది. రంగస్థలం లాంటి హిట్ అందుకుంటేనే తనకి మెగా హీరోల్లో చరణ్ కన్నా ఒక మెట్టు పైన ఉంటానని ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం అల్లు అర్జున్ ది. మరి రంగస్థలం లాంటి హిట్ కొట్టాలంటే అల్లు అర్జున్ కి చాలా సమయమే పట్టేలా ఉంది. అందుకే బన్నీలో రంగస్థలం సినిమా టెంక్షన్ బాగా వుంది.