Advertisementt

నేను గర్భవతిని కాను: ఇలియానా!

Mon 23rd Apr 2018 12:26 PM
ileana,andrew kneebone,pregnancy,social media  నేను గర్భవతిని కాను:  ఇలియానా!
Ileana D'cruz Finally Reacts on her pregnancy నేను గర్భవతిని కాను: ఇలియానా!
Advertisement
Ads by CJ

గత కొన్ని రోజులుగా ఇలియానా పర్సనల్ లైఫ్ విషయంలో సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. ఇలియానాకి తన ఆస్ట్రేలియన్ బాయ్ ఫ్రెండ్ ఆండ్రుతో పెళ్లి జరిగిందని... పెళ్లిని సీక్రెట్ గా దాచేసిందనే న్యూస్ గత మూడు నెలలుగా హల్చల్ చేస్తోంది. అయితే ఇలియానా కూడా తన పెళ్లి జరిగిందని క్లారిటీ ఇవ్వకుండా కన్ఫ్యూషన్ లో పెడుతూ వస్తుంది. తనకి ఆరోగ్యం బాగలేనప్పుడు తన హబ్బీ తనని కంటికి రెప్పలా చూసుకున్నాడని.. ఆండ్రు దొరకడం తనకి అదృష్టమని ఏవేవో చెప్పింది. ఇక ఇలానే క్లారిటీ ఇచ్చి ఇవ్వనట్టు ఇవ్వడంతో అందరూ ఇలియానాకి పెళ్లయిందని ఫిక్స్ అయ్యారు.

ఇక తాజాగా ఇలియానా ప్రెగ్నెంట్ అని కూడా కొన్ని వార్తలు వినబడ్డాయి. అందుకు కారణం ఈమధ్యన ఇలియానా నటించిన రైడ్ చిత్ర ప్రమోషన్స్ లో లూజుగా ఉన్న దుస్తులు ధరించి రావడంతో ఇల్లి బేబీ ప్రెగ్నెంట్ అంటూ బి టౌన్ వర్గాల భోగట్టా అనే న్యూస్ దావానలంలా వ్యాపించింది. ఆ బి టౌన్ ఏమో గాని సోషల్ మీడియాలో మాత్రం టాప్ హీరోయిన్ ప్రెగ్నెంట్ అని.. వాట్ ఇల్లి బేబీ ప్రెగ్నెంటా... అంటూ హాట్ హాట్ న్యూస్ లు వెలువడ్డాయి. అయితే ఇప్పుడు ప్రెగ్నెంట్ వార్తలపై ఇల్లి బేబీ స్పందించింది. తన ప్రెగ్నెంట్ గురించి గత కొన్నిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టేసింది.

నేను గర్భవతిని కాను....  అంటూ కొన్ని ఫొటోస్ ని ఇలియానా తన ఇన్‌స్టాగ్రామ్‌ లో పోస్ట్ చేసింది. అయితే ఆ ఫోటోలను ఆస్ట్రేలియన్ ఫోటో గ్రాఫేర్ అయిన తన బాయ్ ఫ్రెండ్  ఆండ్రూ నీబోన్‌ తీశాడని తెలిపింది. అయితే ఆ ఫొటోస్ లో నిజంగానే ఇలియానా చెప్పినట్లుగా ఆమె తల్లికావడం లేదు అనిపిస్తుంది. ఎందుకంటే అలాంటి టైట్ దుస్తుల్లో ఇలియానా షేప్ చూస్తుంటే ఇల్లి బేబీ నిజమే చెప్పిందనిపిస్తుంది. మరి ఇక్కడితో అయినా ఇలియానా ప్రెగ్నెంట్ వార్తలకు ఫుల్ స్టాప్ పడుతుందేమో చూద్దాం.

Ileana D'cruz Finally Reacts on her pregnancy:

Ileana D'Cruz and Andrew Kneebone Finally Quash Pregnancy Rumours 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ