Advertisementt

సుకుమార్ పెంచేశాడంట..!

Wed 25th Apr 2018 01:20 AM
sukumar,mahesh babu,26th film,remuneration  సుకుమార్ పెంచేశాడంట..!
Sukumar Hiked His Remuneration సుకుమార్ పెంచేశాడంట..!
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ కి 'రంగస్థలం' సినిమాతో మంచి హిట్ అందించాడు దర్శకుడు సుకుమార్. అసలు సుకుమార్ ఇంతకు ముందు చేసిన సినిమాలన్నీ చాల కాస్ట్లీ లొకేషన్స్ లో చేసినవే కావడం.. కథ కూడా రిచ్ గా ఉండడం.. అలాగే సినిమా షూటింగ్ ఎక్కువగా ఫారిన్ లొకేషన్స్ లోనే తెరకెక్కించడం చేసేవాడు. అయితే సుకుమార్ చేసే సినిమాలు సామాన్యమైన అంటే మిడి మిడి జ్ఞానం ఉన్నవారికి సరిగ్గా అర్ధం కావనే నానుడి  ఉంది. సుకుమార్ సినిమాలు చూడాలంటే బుర్రకు పదును పెట్టాలని అంటుంటారు. లెక్కలు మాష్టారు కదా... అందుకే సినిమాలను కూడా లెక్కల మాదిరిగానే  తీసేవాడు. మాములోడికి లెక్కలెట్లా అర్ధం కావో... బుర్రలేని వాడికి సుకుమార్ సినిమాలు అలానే అర్ధం కావు. కానీ సుకుమార్ సినిమాలు 'రంగస్థలం' ముందు వరకు బ్లాక్ బస్టర్ హిట్ అయిన దాఖలాలు లేవు.

కానీ రామ్ చరణ్ తో మొదటిసారి ప్రయోగాత్మకంగా రంగస్థలాన్ని తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. 'రంగస్థలం' సినిమాతో ఆ సినిమా నిర్మాతలైన మైత్రి మూవీ వారికీ బోలెడన్ని లాభాలు తెచ్చిపెట్టింది. సుకుమార్ 'రంగస్థలం' సినిమా మొదలెట్టినప్పుడు సినిమా మీద క్రేజ్ లేదు. ఇక సినిమా సగం పూర్తయ్యాక కూడా ట్రేడ్ వర్గాల్లో కదలిక లేదు. కానీ సినిమా ప్రమోషన్స్ మొదలెట్టినప్పటి నుండి సినిమా మీద భారీగా హైప్ క్రియేట్ అయ్యింది. ఆ లెక్కలోనే 'రంగస్థలం' బిజినెస్ భారీగా జరిగింది. ఇంకా సినిమా విడుదలయ్యాక సుకుమార్ మేకింగ్ స్టయిల్ కి అందరూ వందనం చేశారు. సినిమాలో నటుడిగా రామ్ చరణ్ కి ఎంతగా పేరొచ్చిందో సుకుమార్ కి అంతకంటే ఎక్కువే వచ్చింది. సుకుమార్ మేకింగ్ కి అందరూ ఫిదా అయ్యారు.

అయితే ఇప్పటి వరకు స్టార్ డైరెక్టర్స్ హోదాలో ఉన్నప్పటికీ సుకుమార్ పారితోషికం ఓ అన్నంత లేదు. కానీ 'రంగస్థలం' హిట్ తో సుకుమార్ పారితోషికం భారీగా పెరిగిందనే టాక్ వచ్చేసింది. సుకుమార్ మైత్రి మూవీస్ లో భరత్ తో భారీ హిట్ అందుకున్న మహేష్ బాబు తో కలిసి మహేష్ 26 వ ఫిల్మ్ తెరకెక్కించనున్నాడు. అయితే ఈ సినిమాకి సుకుమార్ దాదాపుగా 15  కోట్ల పారితోషికం అందుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి మూడు నాలుగు సినిమాలకే కొరటాల పారితోషకం 15 కోట్లు అయ్యింది. అలా ఎందుకంటే కొరటాల నాలుగు సినిమాలు భారీ హిట్స్ కొట్టాయి. అయితే సుకుమార్ కి 'రంగస్థలం' హిట్ తోనే పారితోషికం బాగా పెరిగింది. ఇక సుకుమార్, మహేష్ కి 1  నేనొక్కడినే సినిమా ప్లాప్ ఇచ్చాడు. కానీ మహేష్ కి 26 వ మూవీతో సూపర్ హిట్ అందిస్తానని సుకుమార్ ఎప్పుడో మాటిచ్చేశాడు కూడా.

Sukumar Hiked His Remuneration :

Sukumar Remuneration for Mahesh 26th Film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ