శ్రియా భూపాల్... ఈ పేరు రెండేళ్ల కిందట తెలుగు రాష్ట్రాలలో మారుమోగింది. అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అక్కినేని అఖిల్‌కి ఈమె గర్ల్‌ఫ్రెండ్. వీరికి నిశ్చితార్దం కూడా జరిగింది. కానీ ఏవో కారణాల వల్ల వీరి పెళ్లి ఆగిపోయింది. ఇద్దరు బ్రేకప్ చెప్పేశారు. తాజాగా శ్రియభూపాల్‌కి మరో పారిశ్రామిక వేత్తతో ఎంగేజ్‌మెంట్ జరిగింది. దీనికి మెగా కపుల్ అయిన రామ్‌చరణ్, ఆయన భార్య ఉపాసన కూడా హాజరయ్యారు. ఇంతకీ ఈ పారిశ్రామికవేత్త ఎవరో కాదు. ఆయన ఉపాసనకి కజిన్ అవుతాడు. ఉపాసన తల్లి శోభన, ఈ పెళ్లి కుమారుడి తల్లి సంగీత అక్కాచెల్లెలు. అతని పేరు ఆనిందిత్ రెడ్డి.
ఈయన అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాప్‌రెడ్డికి మనవడే కాదు.. ప్రముఖ రాజకీయ, తెలంగాణలోని అతిపెద్ద పారిశ్రామికవేత్త అయిన చేవెళ్ల సింటింగ్ ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి పెద్ద కుమారుడు. వృతిరీత్యా దేశీయ మోటార్స్ స్పోర్ట్స్ సర్కిల్స్‌లో ఆనందిత్ రెడ్డికి మంచి పేరుంది. ఇక ఈవేడుకకు రామ్‌చరణ్, ఆయన భార్య ఉపాసన స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. మరోవైపు ఈ వేడుకలో వారి బంధువు టి.సుబ్బరామిరెడ్డి కూతురు పింకీ రెడ్డి కూడా పాల్గొంది. ఈమె పుట్టినరోజు కూడా అదే రోజు కావడంతో ఈవేడుకలోనే పింకీరెడ్డి బర్త్‌డేని కూడా జరిపారు.
ఇక ఈ నిశ్చితార్ధం సందర్భంగా పలువురు రామ్‌చరణ్‌తో ఫోటోలు దిగడానికి ఉత్సాహం చూపించారు. మొత్తానికి అఖిల్ మాజీ ప్రేయసికి మరో ఎంగేజ్‌మెంట్ జరిగింది. మరోవైపు అఖిల్‌కి హీరోగా కూడా బ్యాడ్‌టైం నడుస్తోందనే చెప్పాలి.