సినిమా రంగమంటే అది హీరోల ఆదిపత్యం అనేది అందరకీ తెలిసిందే. ఎప్పుడో గానీ విజయశాంతి, అనుష్క, నయనతార, త్రిష,శ్రియా, తమన్నా, కాజల్ వంటి లాంగ్ స్టాండింగ్ ఉన్న వారు రారు. ఇక మొన్నటి వరకు అనుష్క హవా నడిస్తే ఆ తర్వాత రకుల్‌ప్రీత్‌సింగ్ హవా నడిచింది. ఇప్పుడు కీర్తిసురేష్, అను ఇమ్మాన్యుయేల్, సాయిపల్లవి, అనుపమ పరమేశ్వరన్ వంటి వారి హవా సాగుతోంది. అయినా వీరందరిలోకి టాప్ ప్లేస్ కోసం పోటీ పడుతున్న వారు ఇద్దరే. వారు కైరాఅద్వానీ, పూజాహెగ్డే.
'ముకుందా, ఒకలైలా కోసం, మొహంజదారో' వంటి ఫ్లాప్స్‌ని అందుకున్న పూజాహెగ్డే తలరాతను బన్నీ మార్చేశాడు. 'డిజె'తో ఈమెని బికినీ భామగా, గ్లామరస్ హీరోయిన్‌ని చేశాడు. ఇక ఈమె ప్రస్తుతం బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సాక్ష్యం' చిత్రంలో నటిస్తోంది. మరోవైపు ఎన్టీఆర్-త్రివిక్రమ్ చిత్రం, ప్రభాస్-జిల్ రాధాకృష్ణ వంటి చిత్రాలలో ఈమె హీరోయిన్‌గా నటించనుంది. ఇక ఇప్పుడు తన మొదటి చిత్రంతోనే సూపర్‌స్టార్ చిత్రంతో పరిచయమై, ఆ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా మారితే ఆ హీరోయిన్ దశ ఎలా తిరుగుతుందో భరత్ అనే నేనులో నటించిన కైరా అద్వానీ నిరూపిస్తోంది.
ఈమె ప్రస్తుతం రామ్‌చరణ్-బోయపాటి చిత్రంలో నటిస్తోంది. దీని తర్వాత ఆమె రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటించే మల్టీస్టారర్ చిత్రంలోఎన్టీఆర్ సరసన నటించనుందని, రామ్‌చరణ్ సరసన పూజాహెగ్డే లేదా రష్మిక మండన్నా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏదిఏమైనా ప్రస్తుతం కైరా అద్వానీ, పూజాహెగ్డేల హవా నడుస్తోందని చెప్పాలి. మరి 'అజ్ఞాతవాసి'తో దెబ్బతిన్న అను ఇమ్మాన్యుయేల్‌కి కూడా బన్నీ 'డిజె' ద్వారా పూజాహెగ్డేకి చాన్స్ ఇచ్చి హీరొయిన్‌గా నిలబెట్టనట్లు, అనుని కూడా 'నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా' ద్వారా టాప్‌లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చేలా చేస్తాడా? లేదా? అనేది వేచిచూడాల్సివుంది...!