తెలుగులో ఈమధ్య కొందరు సీనియర్ హీరోయిన్‌లు వయసు పైబడినా, ఇండస్ట్రీలోకి వచ్చి ఎంతో ఏళ్లు అయినా ఇప్పటికీ ఐటం సాంగ్స్ నుంచి టాప్‌స్టార్స్‌సరసన కూడా నటిస్తూ, తమ ఇమేజ్‌ను, డబ్బును పెంచుకుంటూ ఉన్నారు. దక్షిణాదిలో నయనతార, అనుష్క,కాజల్, తమన్నా, శ్రియ వంటి వారిని దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఇక అలాంటి హీరోయిన్లలో ఒకరు తమన్నా. ఈమె ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లయినా కూడా ఈమె తన ఇమేజ్‌ని మాత్రం పోగొట్టుకోకుండా చూసుకుంటోంది. నందమూరి కళ్యాణ్‌రామ్ సరసన 'నానువ్వే' చిత్రంలో గ్లామరస్‌గా, ఎంతో అందగా పోస్టర్స్‌తోనే మాయ చేస్తోంది. ఇక ఈ జనరేషన్ హీరోయిన్లలో మీకు ఎవరితో నటించాలని ఉంది? అని గతంలో చిరంజీవిని ప్రశ్నించినప్పుడు ఇప్పుడున్న హీరోయిన్లలో తమన్నా అంటే చాలా ఇష్టమని, ఆమెతో కలిసి చిందులు వేయాలని ఉందని చెప్పాడు. ఇప్పుడు అదే విషయం నిజం కానుంది.
ప్రస్తుతం చిరంజీవి తన సొంత బేనర్ అయిన రామచరణ్‌కి చెందిన 'కొణిదెల' బేనర్‌లో 151వ ప్రతిష్టాత్మక చిత్రంగా, తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' చిత్రాన్ని 'సై..రా.. నరసింహారెడ్డి'గా చేస్తున్నాడు. ఇక ఈ చిత్రం షూటింగ్‌ని కూడా జరుపుకుంటోంది. ఇప్పటికే అమితాబ్‌బచ్చన్‌తో కొన్ని సీన్లు చేసినా ఆయన పాత్ర నిడివిని మరింతగా పెంచి తీయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో నయనతారతో పాటు ముగ్గురు హీరోయిన్లు ఉంటారని అంటున్నారు. ఇక తమన్నా పేరు బయటికి వచ్చిన్నంతనే అందరు ఆమెది ఐటం సాంగ్ అని అభిప్రాయపడ్డారు.
కానీ తాజా సమాచారంప్రకారం 'సై..రా..నరసింహారెడ్డి' చిత్రంలో ఉయ్యాల వాడ తరపున ఉంటూ ఆయనకోసం ప్రాణాలు కూడా త్యాగం చేసే వీరనారి, వారియర్ రూపంలో తమన్నా కనిపించనుందని తెలుస్తోంది. ఇక ఈ పాత్ర కోసం ఎందరినో పరిశీలించినా 'బాహుబలి' చిత్రంలో అవంతిక అనే వారియర్‌గా అదరగొట్టిన తమన్నానే తీసుకోనున్నారని తెలుస్తోంది. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం ప్రస్తుతంషూటింగ్‌ను వేగంగా జరుపుకుంటోంది. మరి తమన్నా వారియర్ అయినాకూడా సై..రా నరిసింహారెడ్దిలో ఆమె మెగాస్టార్‌తో కలిసి చిందులు వేస్తుందా? లేదా? అనేదివెయిట్ చేయాల్సివుంది...!