Advertisementt

జోరు పెంచిన ప్రభాస్‌..!

Sat 28th Apr 2018 01:56 PM
prabhas,saaho,shraddha kapoor,evelyn sharma,jackie shroff,mandira bedi,chunky pandey,krishnam raju  జోరు పెంచిన ప్రభాస్‌..!
Prabhas Movie After Shaoo జోరు పెంచిన ప్రభాస్‌..!
Advertisement
Ads by CJ

యంగ్‌ రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌ ఏకంగా 'బాహుబలి-ది బిగినింగ్‌, బాహుబలి-ది కన్‌క్లూజన్‌' చిత్రాలకు కలపి దాదాపు ఐదేళ్లు రాసిచ్చాడు. ఇక 'బాహుబలి-ది కన్‌క్లూజన్‌' విడుదల నాటికే ఆయన తాజా చిత్రం 'సాహో' టైటిల్‌ని, ఫస్ట్‌లుక్‌ని, చిన్న టీజరును కట్‌ చేయడంతో ప్రభాస్‌ జోరు మీదున్నాడని అందరు భావించారు. కాగా 'బాహుబలి-ది కన్‌క్లూజన్‌' పూర్తయిన తర్వాత ఎంతో కాలం అయినా కూడా ప్రభాస్‌ ఇంకా పూర్తి స్థాయిలో 'సాహో' షూటింగ్‌లో పాల్గొనలేదు. దాంతో పాటు 'సాహో' చిత్రం ఈ ఏడాది విడుదల కాదనే సంగతి ప్రభాస్‌ అభిమానులకు బాధనికలిగిస్తోంది. దీని కోసమని రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌ ఓ కీలక నిర్ణయంతీసుకున్నాడు. ప్రస్తుతం అబుదాబిలో 'సాహో' చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ జరుగుతోంది. అక్కడ యాక్షన్‌ సీన్స్‌ని చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, మలయాళం, బాలీవుడ్‌లలో కూడా రిలీజ్‌ చేయనుండటంతో ఆయా భాషలకి చెందిన పలువురు నటీనటులను పెట్టుకున్నారు.

ముఖ్యంగా బాలీవుడ్‌ నటీనటులు, టెక్నీషియన్స్‌కి పెద్ద పీట వేశారు. సంగీతం శంకర్‌ ఎహసాన్‌ లాయ్‌ నుంచి నీల్‌ నితిన్‌, జాకీష్రాఫ్‌, మందిరా బేడీ, చుంకీపాండే, శ్రద్దా కపూర్‌లతో పాటు మహేష్‌ మంజ్రేకర్‌ తో పాటు తాజాగా ఎవలిన్‌ శర్మ కూడా ఈ ట్రూప్‌లో చేరిపోయింది. ఇందులో ఎవిలిన్‌ శర్మ తో పాటు ఈ చిత్రంలో శ్రద్దాకపూర్‌ కూడా పలు యాక్షన్‌సీన్స్‌ లో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక నుంచైనా ఈ చిత్రం షూటింగ్‌ వేగంగా జరిగితే వచ్చే ఏడాది సంక్రాంతికి లేదా సమ్మర్‌కి విడుదల కావచ్చు. 

ఎందుకంటే ఇది కూడా భారీబద్జెట్‌తో, గ్రాఫిక్స్‌, విఎఫ్‌ఎక్స్‌ల మాయాజాలంలో రూపొందుతోంది. ఇక ఒకవైపు యూవి క్రియేషన్స్‌ బేనర్‌లో సుజిత్‌తో 'సాహో' చేస్తున్న ప్రభాస్‌ తన తదుపరి చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ని కూడా జులై 7 వ తేదీన మొదలు పెట్టనున్నాడట. ఇక ఈ చిత్రాన్ని ఆయన పెద్దనాన్న రెబెల్‌స్టార్‌ కృష్ణం రాజు నిర్మించనున్నాడు. మొత్తానికి 'బాహుబలి' ద్వారా తనకు దేశ, విదేశాలలో వచ్చిన గుర్తింపును తన సొంతదైన యూవీ క్రియేషన్స్‌, తదుపరి చిత్రాన్ని కృష్ణం రాజుకు చేస్తూ ప్రభాస్‌ తన తెలివి చూపిస్తున్నాడు.

Prabhas Movie After Shaoo:

Prabhas Next After Saaho Movie Under Krishnam Raju

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ