'నాపేరు సూర్య..నా ఇల్లు ఇండియా' ప్రీరిలీజ్ వేడుకలో అర్జున్ మాట్లాడుతూ.. ప్రతి పరిశ్రమలోనూ టాలీవుడ్ గురించే మాట్లాడుకుంటున్నారు. అందుకు కారణం ప్రేక్షకులే. విభిన్నమైన పాత్రని ఈ చిత్రంలో చేశాను. చాలా కథలు వింటాం..చేస్తుంటాం. కానీ చెప్పినట్లే తీయడం మాత్రం గొప్ప. అది వక్కంతం వంశీ చేసి చూపించాడు. చాలా స్పష్టత ఉన్న దర్శకుడు ఆయన. 150 సినిమాలు చేశాను. విజయవంతమైన రచయిత వక్కంతం వంశీ. కథను పేపర్‌లో రాయడం వేరు. సినిమాగా తీయడం వేరు. 'జెంటిల్‌మేన్'లో శంకర్‌తో పనిచేసినట్లు నాకు అనిపించింది. అల్లుఅర్జున్ ఎంతో డెడికేషన్‌తో నటించాడు. మంచి సాంకేతిక నిపుణులతో పనిచేయడం కోసమే ఇలా కష్టపడుతున్నానని చెబుతాడు. లుక్స్‌పరంగా, నటనాపరంగం ఈ చిత్రం ద్వారా కొత్త బన్నీని చూస్తారు అని చెప్పుకొచ్చాడు.