Advertisementt

శ్రీధర్, నాగబాబులను సెట్ చేసింది బన్నీనే..!

Wed 02nd May 2018 01:25 PM
allu arjun,naa peru surya naa illu india,lagadapati sridhar,naga babu  శ్రీధర్, నాగబాబులను సెట్ చేసింది బన్నీనే..!
This is the Naa Peru Surya Producers Story శ్రీధర్, నాగబాబులను సెట్ చేసింది బన్నీనే..!
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా'. ఈ సినిమా మే 4న మన ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను లగడపాటి శ్రీధర్ నిర్మిస్తే.. నాగబాబు సమర్పించాడు. బన్నీ వాస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. శ్రీధర్ తీసిన సినిమాలన్నీ చిన్న సినిమాలే. కానీ అతనితో బన్నీ చేశాడంటే గతంలో ఏమైనా కమిట్మెంట్ వల్లే చేసాడేమో అనుకున్నారు అంత.

కానీ మ్యాటర్ అది కాదు బన్నీనే స్వయంగా లగడపాటి శ్రీధర్ ను పిలిచి ఈ కథను ఇచ్చాడంట. ఇక ఈ సినిమాను సమర్పిస్తున్న నాగబాబు ‘ఆరెంజ్’ సినిమా తర్వాత సినిమా చేయలేదు. అల్లు అర్జున్ కోరి మరి నాగబాబుని ఈ ప్రాజెక్ట్ లో భాగస్వామి చేశాడట. ఒకరకంగా చెప్పాలంటే బన్నీ ఈ సినిమా చేసింది నాగబాబు కోసమే అని సమాచారం.

అసలు ఈ సినిమాను నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మించాల్సిందట. వక్కంతం వంశీ కథ రెడీ చేయగానే ఆ కథ బన్నీకి వినిపించింది బుజ్జే. బన్నీకి కథ నచ్చింది కానీ ఈ కథ నాకిచ్చేయండి నాకు కొన్ని ఆబ్లిగేషన్లు ఉన్నాయని.. సారీ అని చెప్పి ఈ సినిమాను తన చేతుల్లోకి తీసుకున్నాడట. ‘ఆరెంజ్’ సినిమాతో పూర్తిగా దెబ్బ తిన్న నాగబాబు ఈ సినిమా చేస్తే ఆయనకు కూడా కాస్త డబ్బులు వస్తాయని బన్నీ ఈ సినిమా చేసినట్లు కనిపిస్తోంది. ఇక లగడపాటి శ్రీధర్ తనకు ఎప్పటి నుండో తెలుసు అని స్టైల్ లాంటి మంచి సినిమాలు తీసాడు కానీ డబ్బులు పోగొట్టుకుంటున్నాడని.. అలాంటి మంచి నిర్మాతకు ఓ సినిమా చేద్దామనిపించిందని బన్నీ అన్నాడు.

This is the Naa Peru Surya Producers Story:

allu arjun sets producers for naa peru surya and naa illu india

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ