Advertisementt

మహేష్ 25.. లైన్ లోకి వచ్చేసినట్లే..!!

Wed 02nd May 2018 01:27 PM
mahesh babu,25th film,vamsi paidipally,locations,usa  మహేష్ 25.. లైన్ లోకి వచ్చేసినట్లే..!!
Mahesh 25th Film Latest Update మహేష్ 25.. లైన్ లోకి వచ్చేసినట్లే..!!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం భరత్ అనే నేను సినిమా విజయంతో చాలా సంతోషం గా వున్న మహేష్ బాబు విదేశాల్లో భార్య పిల్లల్తో వెకేషన్స్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. భరత్ అనే నేను అంటూ కొరటాలతో కలిసి హిట్ కొట్టిన మహేష్ బాబు తన విదేశీ ట్రిప్ పూర్తయ్యాక హైదరాబాద్ కి వచ్చి తన 25  వ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు - అశ్విని దత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న మహేష్ 25 వ సినిమా షూటింగ్ జూన్ నుండి మొదలు కాబోతుంది. బృందావనం, ఊపిరి వంటి క్లాసిక్ అండ్ ఫీల్ గుడ్ మూవీ ని తెరక్కెక్కించిన వంశీ పైడిపల్లి ఈసారి మహేష్ తో ఒక యాక్షన్ సినిమా చేయబోతున్నాడనే టాక్ వుంది. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తో ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ పూర్తి చేసిన వంశీ పూర్తి స్క్రిప్ట్ తో ఈ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళుతున్నాడు.

మహేష్ కి జోడిగా పూజ హెగ్డే ని ఎంపిక చేసిన వంశీ.. మిగతా నటీనటులు ఎంపిక ని కూడా చేపట్టాడు. అలాగే బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ కెయు మోహనన్‌ని ఈ సినిమా కోసం దింపుతున్న వంశీ.. ప్రస్తుతం కెయు మోహనన్‌ తో కలిసి అమెరికాలోని న్యూ యార్క్ లో షాట్ మేకింగ్‌పై కసరత్తు చేస్తున్నాడు. ఇదే విషయాన్ని కెయుతో తన వర్క్ ఎక్స్పీరియన్స్‌ ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నాడు వంశీ పైడిపల్లి. మరి దీనినిబట్టి  మహేష్‌బాబుతో చెయ్యబోయే ఈ సినిమాని వంశీ పైడిపల్లి ఎక్కువ శాతం అమెరికాలోనే ప్లాన్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది.

ఇక మహేష్ కాస్త ఫ్రీ కాగానే ఈ సినిమాని వంశీ పట్టాలెక్కించేస్తాడు. పాపం ఊపిరి సినిమా తర్వాత వంశీ.. మహేష్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. కానీ మహేష్ మాత్రం భరత్ షూటింగ్ తో బిజీగా వున్నాడు.

Mahesh 25th Film Latest Update:

Mahesh Babu’s 25th film: Team is scouting locations in USA for shoot

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ