గత నెల నుండి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ కళకళలాడుతుంది. సంక్రాతి నుండి థియేటర్స్ లో పెద్ద సినిమాలేవీ సక్సెస్ కాకపోవడంతో ప్రేక్షకుల్లో ఒకింత నిరుత్సాహం తొంగి చూసింది. అయితే మార్చ్ 30 న రంగస్థలం సినిమా రావడం అది పెద్ద హిట్ అవడంతో టాలీవుడ్ కి కళ కొట్టుకొచ్చింది. అలాగే మరో 20 రోజులకి మహేష్ కూడా భరత్ తో భారీ హిట్ కొట్టాడు. ఆ రెండు సినిమాల హవా అలా ముగుస్తుందో లేదో అల్లు అర్జున్ ఇలా నా పేరు సూర్య తో దిగిపోతున్నాడు. మరి ఈ సినిమాకి కూడా హిట్ కళ కొట్టొచ్చినట్టుగానే కనబడుతుంది. లగడపాటి శ్రీధర్ భారీ బడ్జెట్ తో కొత్త దర్శకుడు వంశి వక్కంతం నా పేరు సినిమాని తెరకెక్కించాడు. మరో 3 రోజుల్లో విడుదల కాబోతున్న నా పేరు సూర్యపై భారీ అంచనాలు ఉన్నాయి.
లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి అల్లు అర్జున్ కోసం భారీగా బడ్జెట్ పెట్టిన శ్రీధర్... నా పేరు సూర్య హిట్ కొడుతుందని కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. ఈ సినిమాతర్వాత లగడపాటి మరో స్టార్ హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో టచ్ లో ఉన్నానని చెబుతున్న శ్రీధర్ నా పేరు సూర్య తర్వాత వాళ్లలో ఎవరో ఒకరితో సినిమా ప్లాన్ చేసే యోచనలో ఉన్నట్లుగా ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు. అయితే ప్రస్తుతానికి స్టార్ హీరోలెవరు ఖాళీగా లేరు. మరి స్టార్ హీరోలు వేరే నిర్మాతలతో తమ సినిమాలు కంప్లీట్ అయ్యాక ఎమన్నా శ్రీధర్ కి అవకాశం ఇస్తారేమో... ఒకవేళ అలాంటి అవకాశం తగిలితే గనక శ్రీధర్ నిర్మాతగా ఎక్కడికో వెళ్లే ఛాన్సెస్ మాత్రం పుష్కలంగా వున్నాయి.