తెలుగు ప్రజల దౌర్భాగ్యం ఏమిటంటే.. ఎదుటి వారు విభజించి పాలించు అనే సూత్రాన్ని అమలు చేస్తే వాటిల్లో పడిపోతారు. తమకు సీటు ఇస్తామని చెప్పినా, ఏమాత్రం మేలు చేస్తామన్నా కూడా జాతికి చేసిన ద్రోహాన్నిసైతం మర్చిపోయి, మనలను మోసం చేసిన వారిని నెత్తి మీద కూర్చోబెట్టుకుంటారు. ఇక ఈ విషయంలో మన తెలుగు నటుడు, డైలాగ్‌కింగ్ సాయికుమార్‌ని చూస్తే అర్ధమవుతోంది. బిజెపి ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పి మోసం చేసింది. తిరుపతి వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీని తుంగలో తొక్కింది. ఇక ఇప్పుడు బిజెపి, కాంగ్రెస్‌లకు కర్ణాటక ఎన్నికలు అత్యంత కీలకంగా మారుతున్నాయి. ఈ ఎన్నికల్లో జెడిఎస్ తరపున ఉత్తర కర్ణాటక ప్రాంతాలలో జనసేనాధిపతి పవన్‌కళ్యాణ్ ప్రచారం చేయనున్నాడు.
మరోవైపు సాయికుమార్ బాగేపల్లి నియోజకవర్గంనుంచి బిజెపి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. బిజెపి తరపున పోటీ చేసే ముందు సాయి ప్రత్యేకహోదాపై, బిజెపి దానిని ఇవ్వకుండా మోసం చేసిన విషయంలో తన మాట ఏమిటో తనస్టాండ్ ఏమిటో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక మోదీపై బాలకృష్ణ చేసిన విమర్శలను గురించి మాట్లాడుతూ, బాలకృష్ణకి కోపం ఎక్కువ అని, బాలకృష్ణ మోదీపై చేసిన వ్యాఖ్యలు సరికాదని చెప్పిన సాయికుమార్ ప్రత్యేకహోదాపై తనతీరును కూడా స్పష్టం చేయాల్సివుంది.
ఇక తాజాగా ఈయన మాట్లాడుతూ, భాగేపల్లిలో పవన్‌కళ్యాణ్ జెడిఎస్ తరపున ప్రచారం చేసినా తనకేమీ నష్టం లేదని, పవన్‌ని ఎదుర్కొనేందుకు తన వద్ద కూడా కౌంటర్లు ఉన్నాయని తెలిపాడు. కర్ణాటక ఎన్నికల్లో బిజెపి విజయం ఖాయమని ఆయన తెలిపాడు.మరి గాలి జనార్ధన్‌రెడ్డి వల్ల బిజెపికి లాభమా? నష్టమా? అనే అంశం మీదనే కర్ణాటకలో బిజెపికి గెలుపా? ఓటమా? అనేది నిర్ణయం అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.