ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ తో కలిసి సెట్స్ మీదున్నాడు. జై లవ కుశ హిట్ తర్వాత త్రివిక్రమ్ తో కలిసి ఎన్టీఆర్ సినిమా చేస్తున్నాడు. అయితే జై లవ కుశ సినిమా అప్పుడు కాస్త లావుగా కనబడడంతో.... ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా కోసం భారీగా వెయిట్ తగ్గాడు. అయితే ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా కన్నా ఎన్టీఆర్, రాజమౌళితో చెయ్యాల్సిన మల్టీస్టారర్ #RRR సినిమా కోసం అంటున్నప్పటికీ.. ప్రస్తుతం ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా కోసమే కష్టపడుతున్నాడు. అయితే ఎన్టీఆర్ తన ఫిట్నెస్ కోసం జీన్స్ లో వర్కౌట్స్ చేస్తున్నాడు. దీనికోసం ఎన్టీఆర్ టాప్ ఫిట్నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ తెచ్చుకున్నాడు.
లాయిడ్ స్టీవెన్స్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ బాగా బరువు తగ్గాడు. అయితే ఎన్టీఆర్ ఇలా సన్నబడడం కోసం ఎక్కువగా అంటే ఓవర్ గా వర్కౌట్స్ చేసాడేమో అనిపిస్తుంది. మొన్న ఐపిల్ యాడ్ లో కాస్త అందంగా బొద్దుగా ఉన్న ఎన్టీఆర్... నిన్న మంగళవారం జరిగిన మహానటి ఆడియో వేడుకలో మాత్రం ఎన్టీఆర్ లుక్ లో కాస్త తేడా కనబడింది. ఎన్టీఆర్ ఓవర్ గా వెయిట్ తగ్గడంతో మోహంలో ఉండాల్సిన గ్లో తగ్గిన ఫీలింగ్ కలుగుతుంది. ఎన్టీఆర్ లుక్స్ లో కాస్త తేడా కనబడుతుంది. మరి ఎన్టీఆర్ ఓవర్ గా జిమ్ లో బరువు తగ్గించడం వలెనే ఎన్టీఆర్ ఇలా వున్నాడు.
ఒకప్పుడు ఎన్టీఆర్ బాగా బరువు పెరిగి ఎబ్బెట్టుగా ఉండేవాడు. అయితే రాజమౌళి యమదొంగ సినిమా కోసం బాగా బరువు తగ్గాడు. అయితే ఆ సినిమాలో ఎన్టీఆర్ బరువు తగ్గినప్పటికీ... లుక్స్ లో పెద్దగా మార్పు రాలేదు. కానీ కంత్రి సినిమా వచ్చేటప్పటికి ఎన్టీఆర్ బాగా పీలగా తయారైయ్యాడు. ఇక అప్పటినుండి మంచి ఫిజిక్ ని మెయింటింగ్ చేస్తున్న ఎన్టీఆర్ మళ్లీ జై లవ కుశ సినిమా టైం కి బరువు పెరగడంతో.... ప్రస్తుతం త్రివిక్రం, రాజమౌళి సినిమా ల కోసం వెయిట్ లాస్ అవ్వాల్సి వచ్చింది. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్... త్రివిక్రమ్ తోనూ, రాజమౌళి తోనూ కమిట్ అయ్యాడు. మరి ఈ సినిమాల్లో ఎన్టీఆర్ లుక్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది మాత్రం వెయిట్ అండ్ సి.