Advertisementt

నిలువ నీడలేని జాకీచాన్‌ కుమార్తె!

Fri 04th May 2018 09:29 AM
jackie chan,homophobic parents,homeless,jackie chan daughter,etta n  నిలువ నీడలేని జాకీచాన్‌ కుమార్తె!
Jackie Chan's daughter claims she is homeless నిలువ నీడలేని జాకీచాన్‌ కుమార్తె!
Advertisement
Ads by CJ

అంతర్జాతీయంగా సూపర్‌స్టార్‌ జాకీచాన్‌కి ఉన్న క్రేజ్‌ ఏమిటో అందరికీ తెలిసిందే. తన నటనతో ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానులను సంపాదించుకున్న జాకీచాన్‌ కూతురు ఎట్టాలెన్‌(18) నిలువ నీడలేక బ్యాంకాక్‌ వీధుల్లో తిరుగుతోంది. నిజానికి జాకీ అనుకుంటే ఎందరో పేదలను పోషించగలడు. కానీ ఆయన కుమార్తె ఈ దీనస్థితిలో ఉండటానికి కారణం లెస్బియనిజాన్ని తన తల్లిదండ్రులు వ్యతిరేకించడమే కారణమని ఎట్టాలెన్‌ తెలిపింది. 

ఈమె తన స్నేహితురాలు ఆండీ అట్టంతో కలిసి ఓ వీడియోను పోస్ట్‌చేసింది. నెలరోజుల నుంచి నిలువ నీడ లేకుండా ఇబ్బంది పడుతున్నాను. చివరికి బ్రిడ్డి కింద కూడా నిద్రించాం. పోలీస్‌స్టేషన్‌, ఆస్పత్రి, ఫుడ్‌ బ్యాంక్‌ వంటిఅన్నిచోట్లకు తిరిగిన ఎవ్వరూ నిలువ నీడను ఇవ్వలేదు. ఎవరు సాయం చేయలేదు. ఇప్పుడేం చేయాలో అర్ధం కావడం లేదు అని తెలిపింది. దీనికంతటికీ స్వలింగ సంపర్కులను వ్యతిరేకించే తన తల్లిదండ్రులే కారణమని చెప్పింది. 

ఎట్టా.. జాకీచాన్‌, మాజీ అందాల తార ఎలైన్‌ ఎన్‌ దంపతుల కుమార్తె. ప్రస్తుతం జోన్‌లిన్‌ అనే మరో మహిళను జాకీచాన్‌ వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఎట్టా తల్లిదండ్రులకు దూరంగా ఉంటోంది. అయితే తన కుమార్తె ఆరోపణలను ఎలైన్‌ ఎన్‌ ఖండించింది. ఏదైనా పని వెతుక్కుని జీవించాలని సూచించింది. అంతేగానీ డబ్బుల కోసం ఇలా ప్రచారం చేయడాన్ని మాత్రం ఆమె తప్పు పట్టింది....! 

Jackie Chan's daughter claims she is homeless:

Jackie Chan’s Daughter Says She’s Now Homeless Because of ‘Homophobic Parents’

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ