మహేష్‌బాబు తండ్రి సూపర్‌స్టార్ కృష్ణ మంచి ఊపులో ఉన్నప్పుడు చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చాడు. ఇక కృష్ణతో పోటీ పడి, మరోవైపు సుమన్ వంటి వారి పోటీని తట్టుకుని మరీ మెగాస్టార్‌గా ఎదిగాడు. నాడు కృష్ణ ఫ్యాన్స్‌కి, చిరంజీవి ఫ్యాన్స్‌కి అసలు పడేది కాదు. నాడు జ్యోతిచిత్ర అనే సినిమా పత్రికలో సూపర్‌స్టార్ కాంటెస్ట్‌ని నిర్వహించేవారు. వీటన్నింటిలో కృష్ణకే సూపర్‌స్టార్ బిరుదు దక్కేది. ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి దాసరి నారాయణరావు తర్వాత సినీ పెద్దగా వ్యవహరిస్తూ, తన వద్దకు వచ్చిన చిత్రాలకు అండగా నిలుస్తున్నాడు. ఆయన మహేష్ బావ, సుధీర్‌బాబు నటిస్తున్న 'సమ్మోహనం' టీజర్‌ని కూడా విడుదల చేసి సుధీర్‌బాబు, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణలకు అనుకూలంగా పాజిటివ్‌గా మాట్లాడాడు.
ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవిమాట్లాడుతూ.. మహేష్‌బాబు అంటే మా ఫ్యామిలీలోని అందరికీ భలే ఇష్టం. ఆయన ప్రతి చిత్రాన్ని మొదటి రోజే కుటుంబ సభ్యులతో చూస్తాం. అలాగే 'భరత్ అనే నేను' చిత్రాన్ని కూడా మొదటి రోజే ఇంట్లో షో వేయించుకుని చూశాను. ఈ చిత్రం అద్భుతంగా ఉంది. కమర్షియల్ హంగులకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్ల ఈ సినిమా విలువ పెరిగింది. ఇక మహేష్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు. అద్భుతంగా నటించాడు. సినిమా చూసిన వెంటనే మహేష్‌కి ఫోన్ చేసి అభినందించాను.
ముఖ్యంగా సినిమాలో వచ్చే విలేకరుల సమావేశం సీన్‌కి నేను బాగా కనెక్ట్ అయ్యాను. మహేష్ జర్నలిస్ట్‌లను ప్రశ్నించేటప్పుడు ఆనందంతో చప్పట్లు కొట్టాను అని చెప్పుకొచ్చాడు, సినిమా చూసినవారందరికీ ఈ ప్రెస్‌మీట్ సీనే నచ్చడం కాకతాళీయమే. మొన్నరాజమౌళి, నిన్న ఎన్టీఆర్, నేడు చిరంజీవిలు అదే సీన్‌పై మాట్లాడుతున్నారంటే వారికి మీడియాపై ఉన్న కోపం ఇలా బయటికి ప్రదర్శిస్తున్నారని చెప్పవచ్చు.