Advertisementt

బన్నీలో వున్న గొప్ప గుణం ఇదే..!

Fri 04th May 2018 03:41 PM
allu arjun,tricks rocking,cap tricks step  బన్నీలో వున్న గొప్ప గుణం ఇదే..!
Allu Arjun Astonishing Cap Tricks Step బన్నీలో వున్న గొప్ప గుణం ఇదే..!
Advertisement
Ads by CJ

హీరోకి కావాల్సింది అందంతో పాటు టాలెంట్ కూడా. కానీ మన టాలీవుడ్ ఇండస్ట్రీ లో కొంత మంది హీరోస్ నటించకుండానే అలా కానిచేస్తుంటారు. కానీ ప్రేక్షకులు మాత్రం వారికి టాలెంట్ ఉంటేనే ఎంకరేజ్ చేస్తారు. వారికి బ్యాక్ నుండి ఎంత సపోర్ట్ ఉన్న కానీ ఆడియెన్స్ లైక్ చేసేది వారి టాలెంట్ ని చూసే. 

మెగా ఫామిలీ నుండి చాలా మంది హీరోస్ ఉన్నారు. అందులో ముఖ్యంగా బన్నీ కష్టపడే గుణాన్ని ఎవరైనా చూస్తే నిజంగా హీరో అవ్వాలంటే కష్టమే అనే మాట రాకుండా ఉండదు. తెరపై వారు ఏం చేసినా మనకి ఈజీగా అనిపిస్తుంటది. కానీ వారు తెర వెనుక ఎంత కష్టపడి చేస్తారో మనకి తెలీదు. డాన్స్ లు కానీ.. ఫైట్స్ విషయంలో కానీ వారు ఎంత కష్టపడతారో వారికే తెలుసు. అలానే బన్నీ తన ప్రతి సినిమాలో డ్యాన్స్ విషయంలో ఏదో ఒక కొత్తదనాన్ని చూపించడం అలవాటే.

'నా పేరు సూర్య' సినిమాలో ఓ సాంగ్ కోసం బన్నీ కష్టపడిన విధానం చూస్తే యాంటీ ఫ్యాన్స్ కూడా తనకి ఫ్యాన్స్ అయిపోతారు. లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో పాట కోసం చేసిన ఆ మూమెంట్స్ కి సంబంధించిన బి హైండ్ సీన్స్ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆ సాంగ్స్ లో బన్నీ మతిపోగొట్టాడనే చెప్పాలి. అందులో క్యాప్ ట్రిక్స్ స్టెప్స్ తో బన్నీ ఎంత కష్టపడ్డాడో చూస్తే మీకే అర్ధం అవుతుంది. దాదాపు మూడు నెలలు కష్టపడి నేర్చుకొని బన్నీ ఆ ట్రిక్స్ చేశాడట. అయితే మేకింగ్ లోనే ఇంత స్టైలిష్ గా చేస్తే ఇంకా ఫుల్ సాంగ్ లో ఎంత బాగా చేసుంటాడో కదా.

Allu Arjun Astonishing Cap Tricks Step:

Allu Arjun's Cap Tricks Rocking

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ