మహేష్‌బాబు-కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన 'శ్రీమంతుడు' చిత్రం నాటి నాన్‌బాహుబలి రికార్డులను కొల్లగొట్టింది. ఇక ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి తన 150వ ప్రతిష్టాత్మక చిత్రం ద్వారా శ్రీమంతుడు రికార్డులను దాటివేశాడు. ఇక అది పూర్తిగా మెగాస్టార్ ఘనత కిందకే వస్తుంది. దశాబ్దం తర్వాత చిరంజీవి చిత్రం రావడం, అందునా అది ఆయనకు 150వ చిత్రం కావడంతో జనాలలో క్రేజ్ ఏర్పడింది. ఇక తాజాగా వచ్చిన 'రంగస్థలం' చిత్రం ద్వారా ఆయన కుమారుడు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ 200కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించి, 'ఖైదీనెంబర్ 150' రికార్డులను తిరగరాశాడు.
కానీ 'రంగస్థలం' చిత్రం ఆ ఘనతను సాధించిన కొన్ని గంటల్లోనే మహేష్‌బాబు -కొరటాల శివల 'భరత్ అనే నేను' ఆ రికార్డును చెరిపేసింది. ట్రేడ్ అనలిస్ట్ లు చెబుతున్న ప్రకారం 'భరత్ అనే నేను' చిత్రం ఇంకా యూఎస్‌లో,ఆస్ట్రేలియాలల్లో దూసుకుపోతోందట. యూఎస్‌లో ఇప్పటికే 3.12 మిలియన్ డాలర్లను సాధించగా, ఆస్ట్రేలియాలో 2.23కోట్లను కొల్లగొట్టింది. ఈ సినిమా కలెక్షన్లు 'రంగస్థలం'కి పోటీగా నిలిచాయని, త్వరలో 'భరత్ అనే నేను' చిత్రం 250కోట్లు సాధించడం ఖాయమని తెలుపుతున్నారు. ఇలా రామ్‌చరణ్ 'రంగస్థలం' చిత్రం నెలరోజుల్లో సాధించిన కలెక్షన్లను మహేష్ 'భరత్ అనేనేను' చిత్రం 12రోజుల్లోనే దాటేయడం విశేషంగా చెప్పాలి.
ఇక ఈ చిత్రం కలెక్షన్లను ఇప్పుడు 'నాపేరు సూర్య..నా ఇల్లు ఇండియా' టార్గెట్ చేస్తోంది. అయితే బన్నీ చేసే మాస్‌యాక్షన్ ఎంటర్‌టైనర్స్ అయిన 'డిజె' గానీ దానికిముందు వచ్చిన పలు చిత్రాలు ఓవర్‌సీస్‌లో పెద్దగా కలెక్షన్లు సాధించ లేదు. అయితే ఈ చిత్రం దేశభక్తి కంటెంట్‌తో రూపొందిన చిత్రం కావడంతో దీనికి ఓవర్‌సీస్‌లలో కూడా మంచి కలెక్షన్లు వస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.