Advertisementt

కమెడియన్ అత్యుత్సాహం కొంపముంచింది!

Sat 05th May 2018 03:07 PM
vivek,comedian,netizen,kollywood,ladies  కమెడియన్ అత్యుత్సాహం కొంపముంచింది!
Netizens fires on the kollywood Comedian Vivek కమెడియన్ అత్యుత్సాహం కొంపముంచింది!
Advertisement
Ads by CJ

నిజానికి సోషల్‌ మీడియావల్ల మీడియా వారికంటే సెలబ్రిటీలకే ఉపయోగం ఎక్కువ. వారు పోస్ట్‌ చేసే కామెంట్స్‌, ట్వీట్స్‌, అర్ధనగ్నంగా కనిపించే ఫొటోలు, మరీ విచ్చలవిడిగా ఎక్స్‌పోజ్‌ చేస్తోన్న ఫొటో షూట్స్‌ వంటి వాటి ద్వారా సెలబ్రిటీలు నిత్యం ప్రేక్షకులలో తమ పేరు నానాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ వారి వ్యవహారశైలి తప్పుపడితే మాత్రం మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది అంటారు. తప్పుని తప్పు అని చెప్పడం కూడా తప్పేనా? అదేమంటే మా శరీరం మాఇష్టం అంటారు. తాము వేసే అర్ధనగ్న దృశ్యాలకు కూడా తమని తాము ప్రేమించుకోవడంలా చెబుతుంటారు. 

ఇలా సోషల్‌ మీడియాలో అత్యుత్సాహం చూపినందువల్ల ప్రస్తుతం ఓ నటుడు చేసిన కామెంట్స్‌వైరల్‌ అవుతున్నాయి. తమిళనాట నగేష్‌, గౌండ్రమణి, సెంథిల్‌, వడివేలు, ఆ తర్వాత వివేక్‌, సంతానం వంటి వారిని ప్రముఖ కోలీవుడ్‌ కమెడియన్లుగా చెప్పుకోవాలి. ఇక తాజాగా తమిళ హాస్యనటుడు వివేక్‌ చేసిన ట్వీట్స్‌పై నెటిజన్లు భగ్గుమంటున్నారు. ఇంతకీ ఆయన దానిలో ఏమన్నాడంటే.. పిల్లలూ, వేసవి సెలవలు వచ్చాయి. బాగా ఎంజాయ్‌ చేయండి. సెలవులను ఆస్వాదిస్తూ ఆటలు ఆడుకున్న తర్వాత మంచినీరు ఎక్కువగా తాగాలని సూచించాడు. ఇక్కడివరకు అయితే ఏ అభ్యంతరం లేదు.కానీ ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ, ఆడపిల్లలు మీరు వంటింట్లోకి వెళ్లిపోయి మీ అమ్మకు సాయం చేస్తూ, వంట చేయడం నేర్చుకోండి. అబ్బాయిలు మీరు మీ నాన్న ఉండే ప్రదేశాలకు వెళ్లి అక్కడి వాతావరణం, కుటుంబం కోసం ఆయనెంత కష్టపడుతున్నాడో చూసి బలంగా తయారు అవ్వండి అని ఉచిత సలహా ఇచ్చాడు. 

అంటే ఆడపిల్లలు కేవలం వంటింటి కుందేళ్లుగా కనిపిస్తున్నారా? అబ్బాయ్‌లేమో ఆఫీసులకి వెళ్లి తండ్రి వ్యవహరాలు చూడమనడం, ఆడపిల్లలు వంటింట్లో వంటలు నేర్చుకోమని చెప్పడం ఈ కాలంలో ఎంత హాస్యాస్పదం. అంతరిక్షంలోకి కూడా వెళ్లి వస్తున్న మహిళలంటే వివేేక్‌కి ఎందుకంత చిన్నచూపు అని నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. 

Netizens fires on the kollywood Comedian Vivek:

Comedian Comments on Ladies

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ