ప్రస్తుతం మెగా ఫ్యామిలీలోని హీరోల సంఖ్య డజనుకు చేరుకుంటోంది. చిరంజీవి, పవన్‌కళ్యాణ్, నాగబాబు కూడా నటులే కావడం.. ఆ తర్వాత రామచరణ్, అల్లుఅర్జున్‌లు స్టార్స్‌గా ఎదిగారు. ఇక సాయిధరమ్‌తేజ్, వరుణ్‌తేజ్‌లు కూడా వైవిధ్యభరితమైన చిత్రాలతో స్టార్స్‌గా ఎదుగుతున్నారు.ఇక ప్రస్తుతం మరో ఇద్దరు మెగా హీరోలు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. చిరంజీవి చెల్లి కుమారుడు, సాయిధరమ్‌తేజ్ తమ్ముడు వైష్ణవ్‌తేజ్ హీరోగా మారుతున్నాడు. పవన్ మావయ్యతో ఎక్కువగా ఉండే వైష్ణవ్‌తేజ్ ఇప్పటికే నటన శిక్షణ ముగించుకుని, త్వరలో హీరోగా పరిచయం కానున్నాడు.
మరోవైపు చిరంజీవి చిన్నఅల్లుడు, శ్రీజ భర్త కళ్యాన్ కూడా శిక్షణ పూర్తి చేసుకుని సినిమా కూడా స్టార్ట్ చేసుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి ఈ ఇద్దరు మెగాహీరోల సినీరంగ ప్రవేశం బాధ్యతలను చూస్తున్నట్లు సమాచారం. ఇక ఈ ఇద్దరి హీరోలలో ఒకరిని రాకేష్ శశి డైరెక్ట్ చేస్తుండగా, మరొకరిని శ్రీనివాస్ అవసరాల డైరెక్ట్ చేస్తాడని తెలుస్తుంది. ఈ రెండు చిత్రాలకు సాయికొర్రపాటినే నిర్మాత అనుకుంటున్నారు.
నందమూరి మోక్షజ్ఞ తెరంగేట్రం చిత్రానికి సాయికొర్రపాటినే నిర్మాత. మరి ఈ ఇద్దరు మెగా హీరోలు హీరోలుగా ఎలాంటి స్థాయిలో ఆకట్టుకంటారో చూడాలి. రామ్‌చరణ్, బన్నీ, తేజు, వరుణ్‌తేజ్‌ల లాగా విభిన్నమైన గుర్తింపును తెచ్చుకుంటారా? లేక అల్లుశిరీష్‌లాగా మిగిలిపోతారా? అనేది వేచిచూడాల్సివుంది. మొత్తానికి మెగా ఫ్యామిలీ అత్యధిక హీరోలు కలిగిన ఫ్యామిలీగా రికార్డులను తిరగరాస్తుందేమో వేచిచూడాల్సి వుంది!