కొందరు ఆయా అధికారులుగా వచ్చేవరకు ఆయా ప్రభుత్వ శాఖలకు అంతటి పవర్ ఉంటుందని జనాలకు తెలియదు. దీనికి ఓ ఉదాహరణ నాడు ఎన్నికల కమిషనర్‌గా టిఎన్ శేషన్ వచ్చేవరకు ఆ పదవికి అంత పవర్ ఉంటుందని ఎవ్వరికి తెలియదు. ఇక సిబిఐ జేడీకి ఎంతటి పవర్ ఉంటుందో జగన్, గాలి జనార్ధన్‌రెడ్డి, సత్యం కుంభకోణంపై లక్ష్మీనారాయణ దూకుడు చూసే వరకు ఎవ్వరికీ తెలియదు. ఈ విషయంలో జేడీ లక్ష్మీనారాయణను ఎంతగానో మెచ్చుకోవాలి. ఆయన జగన్, గాలి, సత్యం నిందితుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించాడు.
ఇక ఈయన మహారాష్ట్ర క్యాడర్‌కి చెందిన 1990వ బ్యాచ్‌కి చెందిన ఐపిఎస్ ఆఫీసర్. 2006లో ఆయన డిప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్ సిబిఐ రీజినల్ జాయింట్ డైరెక్టర్‌గా నియమితుడయ్యాడు. ఆ తర్వాత మహారాష్ట్రకి ట్రాన్స్‌ఫర్ అయిన తర్వాత మహారాష్ట్ర రాష్ట్రానికి అడిషనల్ డీజీగా ఉండగా, స్వచ్చంద పదవీ విరమణ చేశాడు. ఇటీవల ఈయన కుమారుడు కూడా యూపీఎస్సీ పరీక్షల్లో మంచి ర్యాంకునే సాధించాడు. ప్రస్తుతం ఈయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తానని ప్రకటించాడు. జిల్లా వారిగా రైతుల సంఘాలను ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాలలో సాగుపై అవగాహన కల్పిస్తానని చెబుతున్నాడు. రైతులు, ప్రజల స్థితిగతులను పరిశీలించిన తర్వాత రెండు నెలల్లో తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపాడు.
ఇప్పటికే ఆయన జనసేనలో చేరిది లేదని చెప్పేశాడు. శివసేనలో కూడా చేరుతాడని వార్తలు వచ్చాయి.ఆయన బిజెపిలో చేరుతాడని విస్తృత ప్రచారం ఉంది. కొన్ని మీడియాలైతే ఆయన ఏపీకి బిజెపి అధ్యక్షుడు అవుతాడని అంటున్నారు. ఏపీకి చెందిన వ్యక్తి. అందునా ఏపీలో బిజెపి వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్న సమయంలో ఆయన బిజెపిలో చేరడం మంచి పని కాదేమో అనిపిస్తోంది...!