Advertisementt

బన్నీ.. అభిమాని కోరిక తీర్చాడు!

Mon 07th May 2018 03:53 PM
allu arjun,deva sai ganesh,anakapalli,fan  బన్నీ.. అభిమాని కోరిక తీర్చాడు!
Allu Arjun Visits His Ailing Fan బన్నీ.. అభిమాని కోరిక తీర్చాడు!
Advertisement
Ads by CJ

ఇటీవల ఎన్టీఆర్‌, పవన్‌కళ్యాణ్‌, మహేష్‌బాబు, ప్రభాస్‌ నుంచి నితిన్‌ వరకు తమ అభిమానులు కోరికలను తీరుస్తూ వస్తున్నారు. తమ అభిమానులకు ఇబ్బందులు ఉన్నా, వారి పరిస్థితి దీనస్థితిలో ఉన్నా, మరణించినా, ప్రాణాంత వ్యాధులతో బాధపడుతున్నా కూడా వీరు వెళ్లి ఆయా అభిమానులు చివరి కోరికలను తీర్చి వస్తున్నారు. ఇక తాజాగా అల్లుఅర్జున్‌ నటించిన 'నా పేరు సూర్య... నా ఇల్లు ఇండియా' చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. ఇక బన్నీ విషయానికి వస్తే ఈయన మెగా ఫ్యాన్స్‌మీద ఆధారపడకుండా తనకంటూ ఈ నాలుగేళ్లలో మ్యాజిక్‌ చేసినట్లుగా తన క్రేజ్‌ని పెంచుకుంటున్నాడు. 

'సన్నాఫ్‌ సత్యమూర్తి, సరైనోడు, డిజె' చిత్రాల విషయంలో అవి నిజమైన కలెక్షన్లా? లేక ఫేకా అన్న చర్చ సాగుతున్నప్పటికీ నిర్మాతలు మాత్రం ఈ చిత్రాలు 50కోట్లకి పైగా షేర్‌ని సాధించాయని వాదిస్తున్నారు. కానీ ఈ విషయంలో పలువురిలో అభిప్రాయ బేధాలు ఉన్నాయి. ఇక తాజాగా వచ్చిన 'నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' కు కూడా మిక్స్డ్ టాక్ నడిచినా కలెక్షన్స్ మాత్రం అబ్బురపరుస్తున్నాయి. ఇక ఒకవైపు 'రంగస్థలం', మరోవైపు 'భరత్‌ అనే నేను' చిత్రాలు ఇంకా స్టడీగా కలెక్షన్లు సాధిస్తున్న సమయంలో బన్నీ అసలు సిసలు స్టామినాకి ఈ చిత్రం అద్దం పట్టనుంది. 

ఇక తాజాగా బన్నీకి వీరాభిమాని అయిన విశాఖపట్టణం దగ్గర ఉన్న అనకాపల్లిలో దేవసాయి గణేష్‌ అనే అభిమానికి బోన్‌ క్యాన్సర్‌ వచ్చి పరిస్థితి విషమించింది. ప్రస్తుతం ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్న ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో తనకి అల్లుఅర్జున్‌ని చూడాలనేది చివరి కోరికగా చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్ని ఆయన వైద్యులకు కూడా తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న అల్లుఅర్జున్‌ అనకాపల్లి వెళ్లి మరీ దేవసాయి గణేష్‌ని కలిసి పరామర్శించి, ఆప్యాయంగా మాట్లాడి, అతనితో ఫోటోలు కూడా దిగాడు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మొత్తానికి బన్నీ చేసిన ఈ పనిని మాత్రం అందరు మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే అభిమానులు లేకుండా హీరోలు ఉండరు అనేది అందరికీ తెలిసిన విషయమే. 

Allu Arjun Visits His Ailing Fan:

>Allu Arjun Great Support to His Fan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ