అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన సుమంత్, సుశాంత్‌లు పెద్దగా సినిమాలలో రాణించలేక పోతున్నారు. వీరిలో సుమంత్ అయినా కాస్త బెటర్ గానీ అల్లు ఫ్యామిలీలో అల్లు శిరీష్‌లాగా, అక్కినేని ఫ్యామిలీలో సుశాంత్‌ని గురించి చెప్పుకోవచ్చు. సుశాంత్ ఎన్నో సినిమాలు చేసినా ఏదో 'కరెంట్' తప్ప మిగిలిన అడ్డాలు, గడ్డాలు అడ్రస్ లేకుండా పోయాయి. పోని ఫ్లాప్సే కదా అనుకుంటే ఈయన తల్లి నాగసుశీలకు ఆమెకి పార్ట్‌నర్‌గా వ్యవహరించిన వ్యక్తికి మద్య జరిగిన గొడవ, డబ్బుల వ్యవహారం చివరకు నాగ్ వద్దకు చేరి తర్వాత పోలీస్‌లు, కోర్టుల వరకు వెళ్లాయి.
కాగా నటునిగా బాగానే గుర్తింపు తెచ్చుకుంటున్నయంగ్ హీరో రాహుల్ రవీంద్రన్ ఇప్పుడు సుశాంత్‌ని హీరోగా పెట్టుకుని 'చి..ల..సౌ' అనే చిత్రం ద్వారా మెగా పోన్ చేతపట్టుకున్నాడు. ఇక సుశాంత్ చివరి చిత్రం 'ఆటాడుకుందాం..రా' అంటేనే బయ్యర్లు భయపడుతున్నవేళ సుశాంత్ తన అక్కినేని ఫ్యామిలీని వదిలి.. దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన రానా దగ్గుబాటి చేత ఈ చిత్రం టీజర్‌ని విడుల చేయిస్తున్నారు.
ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ ఇప్పటికే రిలీజ్ అయింది. విభిన్నకథలు, పాత్రల ద్వారా దూసుకుపోతున్న రానా కూడా ఒకప్పుడు హీరోగా తనకెరీర్ ప్రారంభంలో పలు వైఫల్యాలను ఎందుర్కొన్న వాడే. మరి ఈ 'చి..ల..సౌ' నిర్మాతలైన భరత్ కుమార్, హరి రాహుల్ రవీంద్రన్‌కి మెగా పోన్ ఇవ్వడం, ఇక టీజర్‌ని రానాచేతిలో పెట్టడం వల్ల దీనివల్ల రానాకు విభిన్నచిత్రాలకు ప్రమోషన్ చేస్తాడనే గుడ్ విల్ ఏమైనా కలిసి వస్తుందో లేదో వేచిచూడాల్సివుంది....!