కావేరి జలాల నేపధ్యంలో తమిళనాడులో నిరసనలు పెల్లుబుక్కుతున్నాయి. దాంతో చెన్నై వేదికగా జరగాల్సిన చెన్నైసూపర్‌కింగ్స్ మ్యాచ్‌లనుపూణె తరలించారు. ఇక ఈ మ్యాచ్‌లు జరిగిన సమయంలో క్రికెట్ ప్రియులు కావేరి విషయంలో ఆందోళన చేస్తూ, చెప్పులు, బాటిళ్లను మైదానంలోకి విసిరి తమ నిరసనతెలిపారు. ఇక ఇతర నాయకుల్లాగే రజనీకాంత్ కూడా తమిళ ప్రజలు కావేరి విషయంలో ఆందోళనగా ఉన్నారని, వారు సెలబ్రేషన్స్ మూడ్‌లో లేరని, ఈ వివాదం విషయంలో ఆయన ప్రజల పక్షం వహించారు. అయితే ఆయన తాజాగా 'కాలా' ఆడియోవేడును 10వేల మందితో జరుపుకుంటుంటే ప్రజలు మాత్రం క్రికెట్ సెలబ్రేషన్స్ జరుపుకునే పరిస్థితిలో తమిళ ప్రజలు లేరని చెప్పిన రజనీకాంత్‌కి ఇప్పుడు 'కాలా' వేడుకను ఇంత భారీస్తాయిలో జరిపితే ఆ సెలబ్రేషన్స్‌ని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? అని విమర్శలు గుప్పించారు.
తాజాగా రజనీ కాంత్ 'కాలా' ఆడియోవేడుకలో మాట్లాడుతూ, నేను మరో సినిమా చేసిన ప్రతిసారి రజనీ పనైపోయిందని పలువురు విమర్శిస్తున్నారు. నాలుగు దశాబ్దాలుగా ఇదే మాట అంటున్నా కూడా నేను పట్టించుకోవడం లేదు. ఈ గుర్రం ఇంకా పరుగులు పెడుతోంది ఏమిటి? అని కొందరు ఆశ్చర్యపోతున్నారు. వాస్తవానికి నేనేమి పరుగెత్తడం లేదు. కేవలం నడుస్తున్నాను అంతే. ఆ దేవుడే నడిపిస్తున్నాడు. అందుకే ఎవరేమి చెప్పినా నా రహదారిలో నేను వెళ్తున్నాను. 'కబాలి' చిత్రం తర్వాత సినిమా చేద్దామనిపలువురుదర్శకులు అడిగారు. ఆ సమయంలో రంజిత్‌ని గుర్తుంచుకుని ముంబైలోని ధారావి మీద గురించి కథ సిద్దం చేయమని అడిగితే మూడు నెలలలోకథను రెడీ చేశాడు. ఇక ఇది ఎన్నోరాజకీయాలతో ముడిపడిన చిత్రం. 'భాషా'లోని ఆంటోని, 'నరసింహ'లోని నీలాంబరిపాత్రలవల్లే ఇందులో'హరిదారా' పాత్ర ఎంతో చాలెంజింగ్‌తోకూడిన పాత్ర. ఈ పాత్రను నానాపాటేకర్ పోషించారు... అంటూ కితాబునిచ్చారు.