నిజమైన స్నేహానికి అర్ధం భార్గవ్ ఆర్ట్స్ గోపాలరెడ్డి, బాలకృష్ణ బాక్సాఫీస్ బోనాంజాగా ఎదగడంతో ఈయనది ప్రముఖ పాత్ర. 'మంగమ్మగారి మనవడు, ముద్దుల మావయ్య, ముద్దుల క్రిష్ణయ్య, ముద్దుల మేనల్లుడు' వంటి ఎన్నో చిత్రాలను ఆయన కోడిరామకృష్ణ దర్శకత్వంలో బాలకృష్ణని హీరోగా పెట్టుకుని నిర్మించాడు. కానీ గోపాల్‌రెడ్డి, కోడి రామకృష్ణలు కలిసి బాలయ్యతో ఓ భారీ జానపదచిత్రాన్ని ప్లాన్ చేశారు. అప్పటికే 'మాతో పెట్టుకోకు' వల్ల గోపాలరెడ్డి దెబ్బతిని ఉన్నాడు. ఇక ఈ జానపద చిత్రం విషయంలో సెట్టింగ్‌లు, కోట్లాది రూపాయల ప్రీప్రొడక్షన్ పనులు జరిగిన తర్వాత కోడికి బాలయ్యకి మద్య వచ్చిన గొడవల వల్ల ఈ చిత్రంలో తాను నటించేది లేదని బాలయ్య భీష్మించుకున్నాడు. అదేమంటే తానే మరోకొత్త దర్శకుడి పేరు సిఫార్సు చేసి ఆయనతో అయితేనేచేస్తానని చెప్పినా కూడా అది కూడా చేయలేదు.
ఇక గోపాల్‌రెడ్డి 'మా బాలాజి, మధురానగరిలో' వంటి చిన్నచిత్రాలు తీస్తూ ఆర్ధికంగా బాగా చితికిపోయాడు. దాంతోఆయన చిన్నవయసులోనే తీవ్రడిప్రెషన్, హార్ట్ ఎటాక్‌తో మరణించాడు. నాడు గోపాలరెడ్దిని బాలయ్య దూరంగా ఉంచడంలో బెల్లంకొండ సురేష్‌ది, బాలయ్యదికూడా పెద్ద పాత్రే. అలా తండ్రి బాలయ్య వల్ల మరణిస్తే, ఆయన కుమారుడు భార్గవ్‌రెడ్డి తాజాగా నెల్లూరు జిల్లాలోని వాకాడు సమీపంలో పంబలి వద్ద సముద్రంలో కొట్టుకపోయాడు. ఆయన వయసు కేవలం 47ఏళ్లు. ఓ కుక్కపిల్ల సముద్రంలో కొట్టుకుపోతుంటే దానిని కాపాడే ప్రయత్నంలోనే భార్గవ్ రెడ్డి సముద్రంలో కొట్టుకుపోయాడని అంటున్నారు. ఆయనకు ఇక్కడ రొయ్యల గుంటలు ఉన్నాయి. ఇక భార్గవ్‌రెడ్డి మరణం పట్ల మనతెలుగు హీరోలు పట్టించుకోకపోయినా చెన్నైలోని విశాల్ బాగాస్పందించాడు.
ఆయన ట్వీట్‌చేస్తూ 'సొంత సోదరుడిని కోల్పోయాను. ఇంత బాధకు ఎప్పుడు గురికాలేదు. నీ సమస్య గురించి నేను పట్టించుకోవాల్సింది. నీ జీవితానికి నువ్వు ముగింపు పలుకుతావని అనుకోవడం లేదు. నిన్ను మిస్ అయ్యానని ట్విట్టర్ ద్వారా చెప్పాలనిపించింది. ఈ మెసేజ్ పెడుతుంటే కన్నీరు ఆగడంలేదని' ట్వీట్ చేశాడు. ఇక నేనే నీ సమస్యను గురించి పట్టించుకోవాల్సింది అనే విశాల్ వ్యాఖ్యలు వింటే ఆయన ఏదో ఇబ్బందుల్లో ఉన్నాడని అర్ధమవుతోంది. మరి ఈయనది సహజ మరణంగా సముద్రంలోకి కొట్టుకుపోయాడా? లేక సముద్రంలోకి దూకి బలవనర్మణం చెందాడా? అనే విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.