Advertisementt

అల్లు శిరీష్ పంట పండిందిపో..!

Mon 14th May 2018 01:59 PM
allu sirish,kv anand,suriya,mohan lal  అల్లు శిరీష్ పంట పండిందిపో..!
Allu Sirish in Suriya and Mohan Lal Movie అల్లు శిరీష్ పంట పండిందిపో..!
Advertisement
Ads by CJ

మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్.. కోలీవుడ్ స్టార్ సూర్య కాంబినేషన్ ఓ మల్టీస్టార్రర్ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి లైకా ప్రొడక్షన్స్‌ ఓ అధికారిక ప్రకటనను కూడా విడుదల చేసింది. సూర్యతో రెండు మూడు సినిమాలు చేసిన కేవీ ఆనంద్‌ దర్శకత్వంలో ఈ భారీ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.

అంతకుముందు వీరి కాంబినేషన్ లో 'వీడొక్కడే', 'బ్రదర్స్‌' చిత్రాలు వచ్చాయి. అయితే ఈ ప్రాజెక్ట్ లో మన టాలీవుడ్ హీరో ఒకరు నటించనున్నారు. అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నాడట. అంతకుముందు అల్లు శిరీష్ మోహన్ లాల్ తో '1971 బియాండ్ బోర్డర్స్' అనే మలయాళం సినిమాలో నటించాడు.

కానీ సూర్య తో ఇదే మొదటి సారి. ఈ విషయాన్ని అల్లు శిరీష్‌ తన సోషల్‌ మీడియా పేజ్‌లో అభిమానులతో షేర్‌ చేసుకున్నారు. తన అభిమాని హీరోతో నటించడం..మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోతో కలిసి వర్క్ చేసే అవకాశం మళ్లీ రావడం నాకు ఆనందంగా ఉందంటూ ట్వీట్‌ చేశారు శిరీష్. మరి ఈ సినిమాలో శిరీష్ ఎటువంటి రోల్ చేస్తాడో చూడాలి.

Allu Sirish in Suriya and Mohan Lal Movie:

Allu Sirish in KV Anand Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ