Advertisementt

'కెలక్కు సామీ'.. వర్మకి భలే పెట్టాడు..!!

Wed 16th May 2018 02:09 PM
ramajogayya sastry,shocking counter,punch,ram gopal varma,pawan kalyan  'కెలక్కు సామీ'.. వర్మకి భలే పెట్టాడు..!!
Ramajogayya Sastry counter to Ram Gopal Varma 'కెలక్కు సామీ'.. వర్మకి భలే పెట్టాడు..!!
Advertisement
Ads by CJ

ఇంతకాలం రాంగోపాల్‌వర్మ అంటే ఏదో ఒక లాజిక్కుతో, వాదనతో కొందరి చేతనైనా నిజమే కదా...! అనే విధంగా వాదన చేసేవాడు. చివరికి ఆయన శ్రీరెడ్డి విషయంలో మాత్రం పవన్‌ను వివాదంలోకి తీసుకుని రావాలని తానే చెప్పినట్లు చెప్పుకొచ్చాడు. నాటి నుంచి వర్మ మేధావితనాన్ని మెచ్చుకునేవారు కూడా ఛీ.. వర్మ ఇంత నీచంగా కూడా వ్యవహరిస్తాడా? అని భగ్గుమన్నారు. ఇక తాజాగా 'నేలటిక్కెట్‌' ఆడియో వేడుకలో పవన్‌కళ్యాణ్‌ రవితేజ తొడపై చేయి వేసిన వీడియో క్లిప్పును పోస్ట్‌ చేస్తూ జనసేనాధిపతిలోని ఈ యాంగిల్‌ అటు పార్టీవారికి, ఇటు మెగా ఫ్యామిలీ వారికి తెలియదంటే ఏదో హోమో సెక్సువల్‌ అనే అర్ధం వచ్చేలా చేసిన నీచమైన కామెంట్స్‌పై మాత్రం అందరు అభ్యంతరం చెబుతున్నారు. కేవలం ఇష్టం వచ్చినట్లు కామెంట్స్‌ చేసి ఇలా ప్రచారం పొందడం ఏమిటనేది అర్ధం కావడం లేదు? 

ఇక వర్మనే హోమోసెక్సువల్‌ అని, అందుకే పచ్చకామెర్ల వాడి కంటికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని పలువురు మండిపడుతున్నారు. ఈ ట్వీట్లపై పెనుదుమారమే రేగుతోంది. ఇక తాజాగా పవన్‌ తిరుమలకి కాలిబాటన వెళ్తున్న సమయంలో అలసిపోయి కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు. ఈ ఫోటోలను వర్మ పోస్ట్‌ చేస్తూ పవర్‌స్టార్‌ ఫుల్‌ ఎనర్జీకి ఇది నిదర్శనమని ట్వీట్‌ చేయడం దారుణమనే చెప్పాలి. ఇక దీనిపై సామాన్యులే కాదు. ప్రముఖ తెలుగు గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి కూడా ఘాటుగా స్పందించాడు. 

వాతావరణం కామ్‌గా ఉన్నప్పుడు కెలక్కు సామీ. తెలుగు వాళ్ల సమయాన్ని వృధా చేయవద్దు. అంతగా ఏమైనా ఉంటే పవన్‌కి పర్సనల్‌గా ఫోన్‌ చేసి మాట్లాడుకో అని చీవాట్లు పెట్టాడు. నిజమే.. వర్మకి వాతావరణం మామూలుగా ఉండటం అసలు నచ్చదు. వాతావరణం వేడిగా ఉండేలా ఆయన ఎవరినో ఒకరిని గిల్లుతూనే ఉంటాడు. ఆయనకు అంత నోటి దూలగా అనిపిస్తే ఇలా పబ్లిక్‌ డోమైన్‌లో కాకుండా తనకు జిల ఉన్నంతమందికి పర్సనల్‌గా ఫోన్‌చేస్తే సరిపోతుంది. అంతేగానీ జనాల సమయాన్ని వృధా చేయడం ఎందుకు...? 

Ramajogayya Sastry counter to Ram Gopal Varma:

Ramajogayya Sastry Shocking Counter Punch To Ram Gopal Varma

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ