Advertisementt

'సాక్ష్యం' చెప్పడానికి పవన్‌ వస్తున్నాడు!

Sat 19th May 2018 03:28 PM
pawan kalyan,sakshyam audio launch,bellamkonda sai srinivas,sriwaas,chief guest  'సాక్ష్యం' చెప్పడానికి పవన్‌ వస్తున్నాడు!
Pawan Kalyan Chief Guest for Sakshyam Movie Audio Launch 'సాక్ష్యం' చెప్పడానికి పవన్‌ వస్తున్నాడు!
Advertisement
Ads by CJ

సినిమాలలో నటించడం మానివేశాను అని చెప్పి పూర్తిగా రాజకీయాలకే పరిమితమైపోయిన పవన్‌ పోకడలో ఇప్పుడు స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. నితిన్‌ నటించిన 'చల్‌మోహనరంగా'కి నిర్మాతగా వ్యవహరించాడు. ఇక 'రంగస్థలం' విజయోత్సవ సభతో పాటు తాజాగా ఒకేరోజు 'నాపేరు సూర్య..నా ఇల్లు ఇండియా' థ్యాంక్సు మీటుకు, ఆ వెంటనే రవితేజ 'నేలటిక్కెట్టు' ఆడియో వేడుకలకు గంటల వ్యవధిలో హాజరవ్వడంతో పవన్‌ సన్నిహితులే కాకుండా ఆయన అభిమానులు కూడా ఆశ్యర్యపోతున్నారు. ఇలా రాజకీయాలలో కాస్త గ్యాప్‌ వస్తే ఆయన సినీ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరవుతున్నాడు.

ఇక ఇప్పుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ హీరోగా పూజాహెగ్డే హీరోయిన్‌గా శ్రీవాస్‌ దర్శకత్వంలో పంచభూతాల బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న'సాక్ష్యం' చిత్రం ఆడియో వేడుక ఈనెల 26వ తేదీన హైదరాబాద్‌లో జరుగనుంది. ఈ వేడుకు కూడా పవన్‌కళ్యాణే ముఖ్యఅతిదిగా రానున్నాడట. ఇప్పటికే ఈ చిత్రం టీజర్‌ ఆసక్తినిరేపగా, దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందించిన ఓ సింగిల్‌ కూడా బయటికి వచ్చి మంచి స్పందన తెచ్చుకుంది. 

ఇక ఇదే వేడుకకు పవన్‌ హాజరు అయితే నెలరోజుల వ్యవధిలోఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్న నాలుగో వేడుక ఇదికానుంది. ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. భారీ చిత్రంగా రూపొందిన ఈచిత్రం తనకు భారీ విజయాన్ని అందిస్తుందనే ఉద్దేశ్యంతో గట్టి నమ్మకంతో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ ఉన్నాడు. ఇక ఈయన నటించిన 'అల్లుడుశీను' చిత్రం ఓకే అనిపించగా.. 'స్పీడున్నోడు, జయజానకినాయకా' చిత్రాలు భారీ బడ్జెట్‌ రీత్యా ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. మరి 'సాక్ష్యం'తోనైనా బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ కెరీర్‌ పవన్‌ పుణ్యాన టర్న్‌ అవుతుందో లేదో వేచిచూడాల్సివుంది..! 

Pawan Kalyan Chief Guest for Sakshyam Movie Audio Launch :

Pawan Kalyan Will attend One more Film Event

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ