అర్జున్ రెడ్డి సినిమాతో మాంచి జోరుమీదున్న విజయ్ దేవరకొండ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా వున్నాడు. మహానటిలో విజయ్ ఆంటోనిగా నటించిన విజయ్ దేవరకొండ మంచి పేరు తెచ్చుకున్నాడు. అలాగే టాక్సీవాలా, గీత గోవిందం, నోట సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విజయ్ దేవరకొండ తో పని చెయ్యడానికి పెద్ద బ్యానర్స్ ఇంట్రెస్ట్ చూపుతున్నాయి. ఈ 3 సినిమాలతో పాటుగా డియర్ కామ్రేడ్ అంటూ మరో సినిమాని చేస్తూ యంగ్ హీరోలకు గట్టి పోటీనివ్వడానికి రెడీ అవుతున్నాడు.
ఇన్ని సినిమాలతో బిజీగా వున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమాని పట్టాలెక్కించే పనిలో ఉండగా.. ప్రస్తుతం మరో సినిమాని లైన్ లో పెట్టాడనే న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఇద్దరి డైరెక్టర్స్ కి మాటిచ్చిన విజయదేవరకొండ ఆ ఇద్దరి డైరెక్టర్స్ తో ఎవరితో ముందు సినిమా మొదలెట్టాలనే ఆలోచనలో ఉన్నాడట. టాక్సీవాలా, గీత గోవిందం షూటింగ్స్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధమవుతుండగా.. నోటా తో పాటు డియర్ కామ్రేడ్ తో పాటుగా ఇప్పుడు కొత్తగా క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో లేదంటే నందినీ రెడ్డి డైరెక్షన్ లో అయినా మరో సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లాలని భావిస్తున్నాడట.
అయితే బాగా ఆలోచించిన విజయ్ దేవరకొండ ముందుగా నందినీ రెడ్డి డైరెక్షన్ లోని సినిమానే చేయడానికి సిద్ధమయ్యాడట. అయితే ఈ సినిమాకి ప్రస్తుతం మహానటి మూవీతో మాంచి ఫామ్లోకొచ్చిన అశ్వనీదత్ కుమార్తెలు స్వప్న దత్ .. ప్రియాంక దత్ లు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. మరి ఇలా రెస్ట్ లెస్ గా సినిమాలు చేస్తూ విజయ్ దేవరకొండ త్వరగా స్టార్ హీరో అవ్వాలనుకుంటున్నట్లుగా కనబడుతున్నాడు.