Advertisementt

'సామిస్క్వేర్‌' విక్రమ్‌ ఇరగదీస్తున్నాడు!

Sat 19th May 2018 07:32 PM
saamy square,vikram,motion poster,hari  'సామిస్క్వేర్‌' విక్రమ్‌ ఇరగదీస్తున్నాడు!
Vikram Saamy Square Motion Poster Released 'సామిస్క్వేర్‌' విక్రమ్‌ ఇరగదీస్తున్నాడు!
Advertisement
Ads by CJ

'అపరిచితుడు' తర్వాత విక్రమ్‌కి మరోపెద్ద హిట్‌రాలేదు. 'మల్లన్న, ఐ' చిత్రాలు కూడా ఆశించిన విజయం సాధించలేదు. ఇక దేశం మొత్తం మీద విక్రమ్‌ అంటే ఎంతో పేరుంది. ఎంతో వైవిధ్యభరితమైన చిత్రాలు చేస్తాడని, పాత్రకోసం ఏం చేయడానికైనా సిద్దంగా ఉంటాడని, ఆయన తన పాత్రలలో పరకాయ ప్రవేశం చేసే నటునిగా, లోకనాయకుడు కమల్‌హాసన్‌, అమీర్‌ఖాన్‌ల తర్వాతి స్థానం విక్రమ్‌దే. ప్రస్తుతం విక్రమ్‌.. హరి దర్శత్వంలో గతంలో చేసిన సూపర్‌హిట్‌ బ్లాక్‌బస్టర్‌ 'సామి'కి సీక్వెల్‌గా 'సామిస్క్వేర్‌' చిత్రం చేస్తున్నాడు. 

'సింగం3' ఇచ్చిన ఫ్లాప్‌తో దర్శకుడు హరి కూడా 'సామి స్క్కేర్‌'ని అద్భుతంగా తెరకెక్కించినట్లు అనిపిస్తోంది. తాజాగా ఈ చిత్రం యూనిట్‌ మోషన్‌పోస్టర్‌ రూపంలో టైటిల్‌ను రిలీజ్‌ చేసింది. మైలు రాయి మీద కత్తితో కూర్చున్న శిలావిగ్రహం, అది విక్రమ్‌రూపంలోకి మారడం, విక్రమ్‌ పేల్చిన తుపాకి బుల్లెట్‌ రాకెట్‌లా దూసుకుపోవడం వంటివన్నీ ఎంతో ఇంట్రస్టింగ్‌గా అనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో విక్రమ్‌ సరసన కీర్తిసురేష్‌ నటిస్తుండగా, సంగీతాన్నిదేవిశ్రీప్రసాద్‌ అందిస్తున్నాడు. తమిని ఫిల్మ్స్‌ పతాకంపై శిబు తమీన్స్‌ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్దమవుతోంది. మే 26న ఈ చిత్రం థియేట్రికల్‌ ట్రైలర్‌ విడుదల కానుంది. 

ఇక గతంలో విక్రమ్‌,హరిలు చేసిన 'సామి' చిత్రాన్నిబెల్లంకొండ సురేష్‌,జయంత్‌సి పరాన్జీ దర్శకత్వంలో 'లక్ష్మీనరసింహ'గా రీమేక్‌చేశాడు. సాధారణంగా రీమేక్‌లు చేయని బాలయ్యను ఆ చిత్రం అంతలా మెప్పించింది. మరి ఈ 'సామిస్క్వేర్‌' కూడా హిట్‌ అయితే దీనిని మరోసారి బాలయ్య రీమేక్‌ చేస్తాడా? లేదా? అన్నది ఆసక్తికరంగా ఉంది. అలాగే ఎప్పటి నుంచో బాలయ్య హరి దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. మరి ఈ కాంబినేషన్‌ సెట్‌ అవుతుందో లేదో వేచిచూడాల్సి వుంది....!

Click Here for Motion Poster

Vikram Saamy Square Motion Poster Released:

Saamy Square first-look motion poster out

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ