నిన్నటి కాలంలో యూత్‌ని డ్రీమ్‌గర్ల్ నమిత అనే చెప్పాలి. ఆమె బొద్దందాల కోసం ఆమె సినిమా వస్తోందంటే చాలు జనాలు థియేటర్ల వద్ద క్యూ కట్టేవారు. ఇక ఈమె తాజాగా తన బోయ్‌ఫ్రెండ్‌ని వివాహం చేసుకుంది. ఇక విషయానికి వస్తే పాతకాలంలో అంజలిదేవి, సావిత్రి, షావుకారు జానకి వంటి ఎందరో పెళ్లయిన తర్వాత కూడా సినిమాలలో నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ నేడు మాత్రం ఎవరైనా హీరోయిన్‌కి పెళ్లయితే కొంత గ్యాప్ ఇచ్చి హీరో అక్క, వదిన, తల్లి వంటి సపోర్టింగ్ రోల్స్‌కి పరిమితం అవుతున్నారు. కానీ బాలీవుడ్‌లో ఇప్పటికీ కూడా పెళ్లయిన హీరోయిన్లకు క్రేజ్ తగ్గడం లేదు. తాజాగా కోలీవుడ్, టాలీవుడ్‌లలో కూడా ఈ మార్పు వస్తోంది. సమంత వంటి వారు నూతన ట్రెండ్‌కి శ్రీకారం చుడుతున్నారు. సమంత పెళ్లయిన తర్వాత వరుసగా హ్యాట్రిక్ సాధించి తన సత్తా చాటింది.
ఇక నమిత విషయానికి వస్తే ఆమె పెళ్లి ముందు నటించిన 'పొట్టు' అనే చిత్రం ఈనెల 25న విడుదల కానుంది. ఇక విశాల్, రజనీకాంత్ అంటే గిట్టని నటుడు, దర్శకుడు, నిర్మాత, బహుముఖ ప్రజ్ఞాశాలి, శింబు తండ్రి త్వరలో ఓ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో చిత్రాన్ని తీయనున్నాడు. ఇటీవల ఇతర హీరోల చిత్రాలలో మామ, అన్నయ్య వంటి పాత్రలను చేస్తున్న రాజేందర్ దాదాపు 11ఏళ్ల తర్వాత చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ రాజకీయ చిత్రం విశాల్, రజనీకాంత్‌లను టార్గెట్ చేస్తూ ఉంటుందని సమాచారం. కాబట్టే ఇందులో రజనీ, విశాల్ అంటే పడని రాధారవి, భారతీరాజా వంటి వారు కూడా ఇందులో భాగస్వాములు అవుతున్నారు. నడిగర్ సంఘం, నిర్మాతల మండలికి విశాల్ వంటి పరభాషా వారు ఉండకూడదని, ఇక రాజకీయాలలో కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన, తమిళంకు చెందని రజనీ వంటి వారు పదవులు చేపట్టడానికి వీలులేదని, వీరు గత కొంతకాలంగా ధ్వజమెత్తుతున్నారు.
సో.. స్వీయ దర్శకత్వంలో, తానే ప్రధాన పాత్ర చేస్తూ, నమితను హీరోయిన్‌గా పెట్టుకుని ఈ పొలిటికల్ సెటైర్ ఫిల్మ్ రూపొందనుంది. ఇక త్వరలో నమిత ప్రత్యక్ష రాజకీయాలలోకి కూడా వచ్చే అవకాశం ఉండటంతో ఈ వార్త ఇప్పుడు సంచలనంగా మారింది.