మొత్తానికి బిగ్‌బాస్ సీజన్2ని తెలుగులో నాని హోస్ట్ చేయడంపై క్లారిటీ వచ్చింది. నిన్న నాని ఈవిషయాన్నితెలుపగా, తాజాగా షో నిర్వాహకులు కూడా దీనిని అఫీషియల్‌గా ప్రకటించారు. ఇంకా మాస్ మస్త్‌గా కావాలా మామా అంటూ నాని తెగ ఊరిస్తున్నాడు. ఇక ఈ షో మొదటి సీజన్ సక్సెస్ మొత్తంగా కేవలం జూనియర్ ఎన్టీఆర్‌కే దక్కుతుంది. ఆయన ఈ షోని ప్రేక్షకులందరిలోకి తీసుకెళ్లడానికి ఎంతో ఉపయోగపడ్డాడు. కేవలం ఎన్టీఆర్‌ని హోస్ట్‌గా చూడాలని, ఆయన వాక్చాతుర్యం, స్పాంటేనియస్‌ని చూడాలని భావించిన ప్రేక్షకులు మొదట ఈ షోని చూశారు. షో కూడా తెలుగు ప్రేక్షకులకు విభిన్నంగా ఉండటం, ప్లస్ ఎన్టీఆర్ అండదండలతో ఈ మొదటి సీజన్ సక్సెస్ అయింది. సాధారణంగా ఏ షో అయినా మొదట్లో ప్రేక్షకుల్లో కలిగించే ఉత్సుకతను రెండోసారి కలిగించదు.
అందునా ఎన్టీఆర్ స్థాయిలో నానికి క్రేజ్ లేదని ఒప్పుకోవాలి. మరి ఈ పరిస్థితుల్లో ఈ సీజన్‌కి మొదట్లో వచ్చే టీఆర్పీలే ఈ షోకి రెండో సీజన్‌లో ఎలాంటి క్రేజ్ వస్తుంది? అనేవి ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. మరి నాని ఎన్టీఆర్‌తో సరితూగుతాడా? తనకు ఉన్న క్రేజ్, వాక్చాతుర్యంతో ఈ షోని హిట్ చేస్తాడా? ఎన్టీఆర్ సాధించిన సక్సెస్‌కి సరితూగే విధంగా చేయగలడా? ఎన్టీఆర్‌ని మించుతాడా? లేక ఎన్టీఆర్‌ని తగ్గించుతాడా? అనే విషయాన్ని ఆసక్తిని రూపుతున్నాయి. ఇక నాని బిగ్‌బాస్2కి హోస్ట్‌గా వ్యవహరిస్తుండటంపై మంచు లక్ష్మి తన ఆనందాన్ని తెలిపింది. ఆమె మాట్లాడుతూ, చాలా గొప్ప అనౌన్స్‌మెంట్ ఇది. నానిని హోస్ట్‌గా ప్రకటించడం ఎంతో ఆనందంగా ఉంది. నానీ.. ఆల్‌ది బెస్ట్. నాకు తెలుసు..నువ్వు అదరగొడతావు అంటూ ట్వీట్ చేసింది.
ఇక నానికి ఆల్‌దిబెస్ట్ చెబుతూ, పలువురు సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తూ నానికి శుభాకాంక్షలు చెబుతుంటే, ఎన్టీఆర్ లేడని తేలడంతో ఆయన అభిమానులు దిగాలు పడుతున్నారు.