Advertisementt

చరణ్‌ ఖుషీ ఖుషీగా ఉన్నాడు..!

Mon 21st May 2018 06:58 PM
ram charan,kaira advani,workouts,social media  చరణ్‌ ఖుషీ ఖుషీగా ఉన్నాడు..!
Ram Charan In Happy Mood చరణ్‌ ఖుషీ ఖుషీగా ఉన్నాడు..!
Advertisement
Ads by CJ

'ధృవ', మరీ ముఖ్యంగా 'రంగస్థలం' చిత్రాల ద్వారా రామ్‌చరణ్‌లో కొత్త ఎనర్జీ వచ్చింది. వరుసగా రెండు డిఫరెంట్‌ చిత్రాలు చేసిన ఆయన ఇప్పుడు పక్కా మాస్‌ యాక్షన్‌ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. విజయవంతమైన చిత్రాల నిర్మాతగా పేరొందిన దానయ్య ఈ చిత్రం నిర్మిస్తుండటం విశేషం. ఇక 'రంగస్థలం'లో చిట్టిబాబు పాత్ర కోసం న్యూలుక్‌లో కనిపించిన రామ్‌చరణ్‌ ఈ కొత్త చిత్రంలో మరో మేకోవర్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్దమయ్యాడు. ఇక ఇందులో దానయ్య నిర్మించిన మహేష్‌బాబు చిత్రం 'భరత్‌ అనే నేను' చిత్రంలో నటించిన కైరా అద్వానీనే హీరోయిన్‌గా నటిస్తోంది. 'భరత్‌ అనే నేను'లో ఎలాంటి గ్లామర్‌కి చోటు లేకపోవడంతో ఈ బోయపాటి చిత్రం ద్వారా ఆమెలోని గ్లామర్‌ యాంగిల్‌ని కూడా చూపించడానికి సన్నద్దాలు జరుగుతున్నాయి. 

మరోవైపు ఈ చిత్రం యాక్షన్‌, మాస్‌ తరహాలోనే కాకుండా, అన్నావదినల సెంటిమెంట్‌ అనే పాయింట్‌ ఆధారంగా కూడా రూపొందుతోంది. ఇక ఈచిత్రంలో జగపతిబాబు, తమిళ హీరో ప్రశాంత్‌, శ్రీకాంత్‌, వివేక్‌ ఒబేరాయ్‌ వంటి పలువురు నటీనటులు నటిస్తుండటంతో ఈ చిత్రం ఐఫీస్ట్‌గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇటీవలే రామ్‌చరణ్‌ ఈ చిత్రం షూటింగ్‌లో జాయిన్‌ కాగా ఆయనపై హైదరాబాద్‌లో భారీ యాక్షన్‌ సీన్స్‌ని చిత్రీకరించారు. ఇక ప్రస్తుతం ఈ యూనిట్‌ బ్యాంకాక్‌లో మరో షెడ్యూల్‌ చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు రామ్‌చరణ్‌-కైరా అద్వానీలపై రెండు పాటలు కూడా చిత్రీకరణ జరుపుతారు. ఈ చిత్రం షూటింగ్‌ గ్యాప్‌లో రామ్‌చరణ్‌ అక్కడి చెరువులోని చేపలకు చెర్రీ ఆహారం వేస్తూ, మరోపక్క హీరోయిన్‌ కైరా అద్వానీతో కలిసి ఎక్స్‌ర్‌సైజ్‌లు చేస్తున్నారు. 

ఇలా చెర్రీ చేపలకు ఆహారం వేస్తున్న వీడియోతోపాటు కైరా అద్వానీతో రామ్‌చరణ్‌ చేస్తున్న వ్యాయామానికి చెందిన వీడియోలను కూడా చెర్రీ శ్రీమతి ఉపాసన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తుండగా ఈ మూవీని దసరా కానుకగా విడుదల చేయనున్నారు. త్వరలో ఈచిత్రానికి సంబంధించిన పవర్‌ఫుల్‌ టైటిల్‌ని ప్రకటించనున్నారని సమాచారం. 

Ram Charan In Happy Mood:

Ram Charan and Kaira Advani Workouts Video Hulchal in social movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ