'బాహుబలి'తో చారిత్రక కథ వంటి ఓ ఊహాజనిత కథను గ్రాండియర్‌గా ఆవిష్కరించిన రాజమౌళి తర్వాత కేవలం ఒకే ఒక్క చిత్రం అనుభవం ఉన్న సుజీత్‌ని దర్శకునిగా పెట్టుకుని ఈసారి యంగ్ రెబెల్‌స్టార్ ప్రభాస్ ఏకంగా హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీన్స్‌తో నిండిన చిత్రం చేస్తుండటం విశేషమేనని చెప్పాలి. 'బాహుబలి'కి ఏమాత్రం సంబంధంలేని మరో లోకానికి తీసుకెళ్లి హాలీవుడ్ యాక్షన్ తరహా చిత్రాలను కూడా తెలుగువారు ఆవిష్కరించగలరని నిరూపించేందుకు డార్లింగ్ రెడీ అవుతున్నాడు. అందునా ఇది తన సొంత బేనర్ వంటి యువి క్రియేషన్స్ బేనర్‌లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతుండటం మరో విశేషం.
ఈ చిత్రానికి కూడా బడ్జెట్ లిమిట్స్ లేని తరహాలో ఓ అద్భుతమైన ఐఫీస్ట్‌ని కలిగించేలా భారీ కాన్వాస్‌పై 'సాహో' చేస్తున్నాడు. తాజాగా ఈచిత్రంలోనే హైలైట్‌గా నిలిచే ఓ భారీ యాక్షన్ సీన్‌ని అద్భుతంగా చిత్రీకరించారని తెలుస్తోంది. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీబెట్స్, సుజీత్‌ల నిర్దేశంలో 37 ఖరీదైన ఎస్‌యువి కార్లు, నాలుగు ట్రక్కులతో ఈ ఛేజింగ్ తీశారట. సీజీ వర్క్‌తో సరిపెట్టకుండా ఖర్చుకు వెనుకాడకుండా రియల్ ఛేజింగ్‌ని అదరహో అన్న స్థాయిలో అబుదాబిలో చిత్రీకరణ జరిపారు. ఇన్నికార్లు, ట్రక్కులను నిర్మాతలు యూఎస్ నుంచి దిగుమతి చేసుకున్నారు. ఛేజింగ్ సీన్‌లో కార్లు, ట్రక్కులు ఢీకొడుతూ ప్రభాస్ బైక్‌పై చేసే విన్యాసాలు 'సాహో' అనే రీతిలోనే ఉంటాయని అంటున్నారు.
మొత్తానికి ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో కూడా రూపొందిస్తుండటం వల్ల నిర్మాతలు మరింత బడ్జెట్‌ని కూడా కేటాయించడానికి, రాజీ అనే పదం వాడకుండా చేస్తున్న ఈ ప్రయత్నం విజయవంతం కావడం ఖాయమని యాక్షన్ ప్రియులు ఆశలు పెట్టుకున్నారు.