Advertisementt

మెగాస్టార్ కూతురు కూడా రెడీ!

Thu 24th May 2018 11:50 AM
amitabh bachchan,shweta bachchan,jewellery ad  మెగాస్టార్ కూతురు కూడా రెడీ!
Big B Daughter Small Screen Entry మెగాస్టార్ కూతురు కూడా రెడీ!
Advertisement
Ads by CJ

బిగ్‌బి అమితాబ్‌బచ్చన్‌ ఫ్యామిలీ అభిమానులకు మరో శుభవార్త. ఇన్నేళ్లుగా ఇండస్ట్రీని ఏలుతున్న బిగ్‌ బి అమితాబ్‌బచ్చన్‌ ఫ్యామిలీ నుంచి ఇప్పటికే అమితాబ్‌, జయా బచ్చన్‌, అభిషేక్‌బచ్చన్‌, ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌లు వెండితెరపై వెలుగుతున్నారు. అయితే ఇంతకాలానికి ఆయన ఫ్యామిలీ నుంచి మరొకరు వెండితెరపై కాకపోయిన బుల్లితెరపై దర్శనమివ్వనున్నారు. ఆమె ఎవరో కాదు.. అమితాబ్‌బచ్చన్‌ కూతురు శ్వేతాబచ్చన్‌, ప్రస్తుతం అమితాబ్‌ రిషికపూర్‌కి తండ్రి '102 నాటౌట్‌'లో చేశాడు. అదే ముసలి గెటప్‌లో ఆయన ఓ వాణిజ్య ప్రకటనలో కనిపించనున్నాడు. ఈ ప్రకటనలో ఆయనతో పాటు ఈయన కుమార్తె శ్వేతాబచ్చన్‌ ఓ సాధారణ మహిళగా కనిపించనుండగా, అమితాబ్‌ ముసలి గెటప్‌లో కనిపించనున్నాడు. వీరిద్దరు కలిసి ఓ జ్యూవెలరీ సంస్థకు సంబంధించిన ప్రకటనలో నటించారు. ఈ ప్రకటన జులై నుంచి ప్రసారం కానుంది. ఇంతకాలం తన కుమార్తెను పరిచయం చేయని అమితాబ్‌ ఈ విధంగా తన అభిమానుల కోరికను తీరుస్తుండటం విశేషం. 

ఇక ఇప్పటికీ ఈ యాడ్‌కి సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. కొందరేమో ఈ జ్యూవెలరీ యాడ్‌ కళ్యాణ్‌ జువెలర్స్‌కి సంబంధించినది అంటున్నారు. బహుశా ఆ యాడ్‌ బయటి వారిది కాకపోవచ్చని, జ్యూవెలరీ వ్యాపారం కూడా సొంతగా చేస్తున్న బచ్చన్‌ ఫ్యామిలీకి చెందిన సొంత యాడ్‌లోనే ఆయన కుమార్తె తెరంగేట్రం జరగనుందని అంటున్నారు. ఇక శ్వేతా బచ్చన్‌ విషయానికి వస్తే ఆమె 1997లో ఢిల్లీకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నిఖిల్‌ నందన్‌ను వివాహం చేసుకుంది. శ్వేత-నిఖిల్‌ నందన్‌ల దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 

మొత్తానికి ఈ విషయం బచ్చన్‌ అభిమానులకు తీపి వార్తేనని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో ఆయన మనవళ్లు, మనవరాళ్లు కూడా వెండితెరపై మెరిసే అవకాశాలను కొట్టి పారేయలేమని ఈ సంఘటన నిరూపిస్తోంది. 

Big B Daughter Small Screen Entry:

Shweta Bachchan and Amitabh Bachchan in Jewellery AD

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ