Advertisementt

రాధికపై ఇలాంటి ప్రచారమా?

Thu 24th May 2018 04:58 PM
radhika sarathkumar,cancer,rumours,social media  రాధికపై ఇలాంటి ప్రచారమా?
Gossip on Actress Radhika Sarathkumar Health రాధికపై ఇలాంటి ప్రచారమా?
Advertisement
Ads by CJ

సోషల్‌ మీడియా వల్ల, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని దుష్పరిణామాలు కూడా ఉన్నాయి. ఇటీవల సోషల్‌ మీడియా వేదికగా ఎటువంటి ఆధారాలు లేని పలు వార్తలు స్వైరవిహారం చేస్తున్నాయి. బతికున్న వారిని చంపేస్తున్నారు. ఆర్యోగంగా ఉన్నవారికి అనారోగ్యాలు అంటగడుతూ ప్రచారం చేస్తున్నారు. దీంతో ఈ ఆధునిక సాంకేతికత వల్ల నిజాలు రాసే వారి మాటలు కూడా నిజామా? కాదా? అనే అనుమానాలు తొంగిచూసేలా చేస్తున్నాయి. ప్రతి ఒక్కరిని అనుమానించే పరిస్థితి. ఏది నిజమో, ఏది పుకారో అర్ధం కాని స్థితి. 

ఇక సీనియర్‌ హీరోయిన్‌, అటు బుల్లితెర, వెండితెరపై కూడా బిజీగా ఉండే నటి, రాడాన్‌ మీడియా వర్క్స్‌ అధినేత రాధికా శరత్‌కుమార్‌కి ఇటీవల క్యాన్సర్‌ అని సోషల్‌ మీడియాలో వార్తలు పుట్టుకొచ్చాయి. ఆమె ఇటీవల తెలుగులో 'రాజా ది గ్రేట్‌' చిత్రంలో రవితేజ తల్లిగా నటించి, నవ్వించి మెప్పించింది. ఇక ఓ అభిమాని మీకు క్యాన్సర్‌ అట కదా...! అని ప్రశ్నించడంతో ఎట్టకేలకు ఈ అనుమానాలకు తెరపడింది. 

దానికి రాధిక సమాధానం ఇస్తూ, అది నిజం కాదు... కేవలం కల్పితమే అని తేల్చేసింది. దాంతో ఆమె అభిమానులు కుదుటపడ్డారు. కాగా ప్రస్తుతం రాధిక పలు తమిళ చిత్రాలలో, సీరియల్స్‌లో నటిస్తోంది...!

Gossip on Actress Radhika Sarathkumar Health:

Radhika Sarathkumar Condemned Cancer Rumours

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ