Advertisementt

నాని ఎందుకు డిజప్పాయింట్ అయ్యాడు!

Sat 26th May 2018 11:47 AM
nani,koratala shiva movie,disappointe  నాని ఎందుకు డిజప్పాయింట్ అయ్యాడు!
Nani Missed Koratala Shiva Movie నాని ఎందుకు డిజప్పాయింట్ అయ్యాడు!
Advertisement
Ads by CJ

మీడియం రేంజ్ హీరోల్లో ముందుడే పేరు నేచురల్ స్టార్ నానిదే. వరుస విజయాలతో దూసుకుపోతున్న నానికి కృష్ణార్జున యుద్ధం బ్రేక్ వేసింది. అయినా ప్రేక్షకుల్లో నానికున్న ఫాలోయింగ్ ఏ మాత్రం చెక్కుచెదరలేదు. అయితే నాని వరుస విజయాలను అందుకున్నది మాత్రం మీడియం రేంజ్ డైరెక్టర్స్ తోనే. ఇంతవరకు ఒక్క స్టార్ డైరెక్టర్ తోనూ నాని సినిమా చెయ్యలేదు. ఈగ సినిమాలో రాజమౌళితో కలిసి పనిచేసినా.. ఆ సినిమాలో నాని ఒక గెస్ట్ పాత్రలో చేసినట్టే. అయితే నాని కృష్ణార్జున యుద్ధం తర్వాత నాగార్జునతో కలిసి శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వంలో మల్టీస్టారర్ సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమా తర్వాత నాని విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అయినా.. కొరటాల శివ దర్శకత్వంలో అయినా సినిమా చేయాలనుకున్నది. అసలు తాను కొరటాలను కలవలేదని చెప్పినప్పటికీ... కొరటాల శివతో నానికి సినిమా చెయ్యాలనే ఉంది. ఇక విక్రమ్ కుమార్ కథ నచ్చక నాని, విక్రమ్ కుమార్ ని సైడ్ చేసేశాడు. అయితే నానికి కొరటాల మీద గురి ఉంది. అలాగే కొరటాల కూడా ఇప్పటివరకు స్టార్ హీరోలతో సినిమాలు చేసి.. ఇప్పుడు తనకిష్టమైన హీరోలెవరు అందుబాటులో లేక.. నేచురల్ స్టార్ నానితో సినిమా చెయ్యాలనుకున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.

ఇక త్వరలోనే నాని - కొరటాల కాంబో సెట్ అవుతుంది అనుకున్న తరుణంలో కొరటాలకు చిరంజీవి నుండి పిలుపు రావడం.. కొరటాలకు మెగాస్టార్ తో సెట్ కావడంతో.. నాని ఉసూరుమన్నాడనే టాక్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. నానికి పెద్ద డైరెక్టర్ తో చేసే అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయిందనే గుసగుసలు వినబడుతున్నాయి. మరి కొరటాల నెక్స్ట్ హీరో చిరు అవునో.. కాదో.. తెలియదు గాని నాని మాత్రం బాగా డిజప్పాయింట్ అయ్యాడనే టాక్ మొదలయింది. ఇక ప్రస్తుతానికి నాని మల్టీస్టారర్ తో పాటుగా బిగ్ బాస్ సీజన్ 2 కి వ్యాఖ్యాతగా 15  రోజులు కాల్షీట్స్ స్టార్ మాకి ఇచ్చేశాడు. ఇందుకు గాను నాని అక్షరాలా మూడున్నర కోట్లు అందుకుంటున్నాడు.

Nani Missed Koratala Shiva Movie:

Hero Nani Missed Big Chance, That's Why he Disappointed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ