Advertisementt

సన్నీలియోన్ చేసిన తప్పేంటో తెలుసుకుంది!

Mon 28th May 2018 02:57 PM
sunny leone,documentary,heart broke,thousand times  సన్నీలియోన్ చేసిన తప్పేంటో తెలుసుకుంది!
Actress Sunny Leone Broke Down Watching Documentary సన్నీలియోన్ చేసిన తప్పేంటో తెలుసుకుంది!
Advertisement
Ads by CJ

సన్నిలియోన్‌ అంటే ప్రజలందరికీ పోర్న్‌స్టార్‌గా మాత్రమే తెలుసు. ఆ తర్వాత బాలీవుడ్‌తో పాటు పలు ప్రాంతీయ భాషల్లో కూడా నటిస్తోంది. ఇక ఈమె ఓ పాపను దత్తత తీసుకుని, మరో ఇద్దరికి సరోగసీ ద్వారా తల్లి అయింది. ఇక ఈమెలోని మరో కోణం ప్రేక్షకుల మనసులను తడిచేస్తుంది. ఇక ఈమె ప్రస్తుతం 'వీరమహాదేవి' చిత్రంలో వీరనారిగా నటిస్తూనే తన అసలు పేరైన 'కరన్‌జిల్‌ కౌర్‌-ది అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ సన్నిలియోన్‌' అనే డాక్యుమెంటరీ కూడా చేస్తోంది.

తాజాగా ఆమె తన బయోపిక్‌ అయిన ఈ డాక్యుమెంటరీ ప్రీవ్యూని చూసిందట. ఈ ప్రీవ్యూ చూస్తున్నంత సేపు నాకు కన్నీరు ఆగలేదు. హృదయం వేలసార్లు బద్దలైంది. ఆ రాత్రంతా నిద్రలేకుండా ఏడుస్తూనే గడిపాను. పోర్న్‌ సినిమాలలోకి రాకముందు నేను ఎలా ఉండేదాన్నో అలాగే ఇప్పుడు ఉండాలనుకుంటున్నాను. కానీ ఆ రోజు ఎప్పటికీ రాదు. అయినా నా పాత వ్యక్తిత్వం ఎప్పటికీ అలాగే ఉంటుంది. నేను జీవితంలో తప్పు చేశాననే భావన ఈ డాక్యుమెంటరీ చేసినంత సేపు నాకు అనిపించింది.. అంటూ భావోద్వేగ పూరిత ట్వీట్‌ చేసింది. 

ఇక ఈ డాక్యుమెంటరీలో పంజాబీ యువతి అయిన కరన్‌జీత్‌ కౌర్‌ సన్నీలియోన్‌గా ఎందుకు మారింది? దానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి? పోర్న్‌స్టార్‌గా ఎలా మారింది? ఆ తర్వాత ఇండియాకి వచ్చి బాలీవుడ్‌ చిత్రాలలో నటించేందుకు ఎంత కష్టపడింది? పరిశ్రమ ఆమెను ఎలా చేసింది? ప్రేక్షకులకు ఆమెపై ఉన్న భావం ఏమిటి? వంటి పలు విశేషాలతో నిండి ఉండనుంది. దీని కోసం పలువురు ఎప్పుడు విడుదల అవుతుందా? చూద్దామా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

Actress Sunny Leone Broke Down Watching Documentary:

My Heart Broke a Thousand Times: Says Sunny Leone

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ