Advertisementt

పూనమ్ ఎఫెక్ట్: త్రివిక్రమ్ వచ్చేశాడు!

Mon 28th May 2018 07:59 PM
trivikram srinivas,pawan kalyan,poonam kaur,allegations,interview  పూనమ్ ఎఫెక్ట్: త్రివిక్రమ్ వచ్చేశాడు!
Poonam Kaur effect on Trivikram Srinivas పూనమ్ ఎఫెక్ట్: త్రివిక్రమ్ వచ్చేశాడు!
Advertisement
Ads by CJ

ఎప్పుడు చాలా హుందాగా.. అందరిని పొగుడుతూ తన గురించిన విషయాలేమి బయటికి రానివ్వకుండా జాగ్రత్త పడే దర్శకుడు త్రివిక్రమ్ మొదటిసారి తన విషయాలు, తన సినిమాల విషయాల ముచ్చట్లను ఒక ఇంటర్వ్యూ ద్వారా అందరికి తెలియబరిచాడు. నిన్న ఆదివారం త్రివిక్రమ్ గురించిన న్యూస్ లే వెబ్ మీడియా దగ్గరనుండి సోషల్ మీడియా వరకు హల్చల్ చేశాయి అంటే.. త్రివిక్రమ్ గురించిన ఇంటర్వ్యూ ఎంత పెద్ద సెన్సేషన్ అయ్యిందో వేరే చెప్పక్కర్లేదు. అయితే ఉన్నట్టుండి త్రివిక్రముడు ఇలా బయటికి రావడానికి గల కారణం మాత్రం నటి పూనమ్ కౌర్ అంటూ కొన్ని సెటైర్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

పూనమ్ కౌర్ ఈమధ్యన త్రివిక్రమ్ ని ఇండైరెక్ట్ గా టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. జల్సాలు చూపిస్తూ అజ్ఞాతవాసంలో ఏసేస్తాడు. జాగ్రత్త నమ్మకద్రోహి హాట్ ట్వీట్స్ చేసిన పూనమ్ కౌర్ కి సమాధానం చెప్పడానికే త్రివిక్రమ్ ఇలా బయటికొచ్చాడా? అనే డౌట్ మాత్రం అందరిలో మెదులుతుంది. తాను చెప్పే దర్శకుడికి అమ్మాయిల పిచ్చి ఉందని, హీరోయిన్స్ ని వాడుకుని అవకాశాలు ఇస్తాడని ఇలా త్రివిక్రంపై చాలానే ఆరోపణలు చేసింది పూనమ్ కౌర్. మరి పూనం చేసిన ఆరోపణలు తిప్పికొట్టేందుకు.. త్రివిక్రమ్ ఇలా ఒక న్యూస్ పేపర్ కి సమయం సందర్భం లేకుండా ఇంటర్వ్యూ ఇచ్చాడా..?

లేదంటే తన సినిమాలు పోయినా ఎప్పుడూ మాట్లాడని త్రివిక్రమ్ ఇప్పుడు ఇలా ఇంటర్వ్యూ ఇవ్వడమేమిటి? అసలు తన సినిమాల విడుదలవుతున్నాయంటే కూడా  ఒక్క ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడు. కానీ ఇప్పుడు మాత్రం.. మరి నిజంగానే పూనమ్ కౌర్ కి త్రివిక్రమ్ భయపడ్డాడా? అంటూ సోషల్ మీడియా లో నానా హంగామాగా న్యూస్ లు వెలువడుతున్నాయి. అసలు అజ్ఞాతవాసి సినిమా పోయిన ఇన్నాళ్ళకి త్రివిక్రమ్ పెదవి విప్పి ఆ సినిమా పోవడానికి ఒక కార్పొరేట్ కథ అని, బయ్యర్లకు నష్టాలను పూడ్చేశామని, పవన్ కి తనకి ఎలాంటి గొడవ జరగలేదని, అంతేకాకూండా సినిమా పోయినప్పుడు బాధ ఉంటుందని.. అలాగే తనకి ఉందని.. ఒక ప్లాప్ ఎదురైతే మరోసారి అలాంటిది జరక్కుండా జాగ్రత్త పడతామని... అందుకే ఎన్టీఆర్ సినిమాని తగు జాగ్రత్తలతో తెరకెక్కిస్తున్నట్లుగా త్రివిక్రమ్ ఆ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.

Poonam Kaur effect on Trivikram Srinivas:

Trivikram Srinivas shocking response on Poonam Kaur allegation

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ