Advertisementt

శ్రియ భూపాల్ పెళ్ళికి హాజరైన మెగా జంట!

Wed 30th May 2018 12:16 PM
ram charan,upasana,mega power star,shriya bhupal wedding  శ్రియ భూపాల్ పెళ్ళికి హాజరైన మెగా జంట!
Ram Charan And Upasana At Shriya Bhupal Wedding శ్రియ భూపాల్ పెళ్ళికి హాజరైన మెగా జంట!
Advertisement
Ads by CJ

ఇప్పుడు ప్రస్తుతానికి మెగా జంట రామ్ చరణ్ - ఉపాసనలు ఒక ముఖ్య ఫ్యామిలీ మెంబెర్ పెళ్లిలో తెగ సందడి చేస్తున్నారు. ఫ్యామిలీ టైం అంటూ పెళ్ళిలో ఈ మెగా జంట పాల్గొంటూ అక్కడినుండి రామ్ చరణ్ భార్య ఉపాసన కొన్ని ఫొటోస్ ని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. అయితే ఉపాసన - రామ్ చరణ్ లు వెళ్లిన అంత ఇంపార్టెంట్ పెళ్లి ఎవరిదీ అనే కదా మీ డౌట్. ఆ పెళ్లి ఎవరిదో కాదు అఖిల్ మాజీ లవర్ శ్రియ భూపాల్ ది అని సమాచారం. అక్కినేని ఇంటి కోడలిగా అఖిల్ కి భార్య గా నాగార్జున ఇంట కాలుబెట్టబోయి.. ఆగిపోయిన శ్రియ భూపాల్, ఉపాసన వాళ్ళ ఫ్యామిలీకి బాగా కావాల్సిన అమ్మాయి.

అయితే అఖిల్ తో పెళ్లి ఆగిపోయినాక.. అఖిల్ కెరీర్ లో బిజీ అయితే శ్రియ భూపాల్ మాత్రం పెళ్ళికి రెడీ అయ్యింది. ఈ ఏడాది ప్రథమార్ధంలో ఉపాసన కజిన్ అనిందిత్ తో శ్రియ భూపాల్ నిశ్చితార్థం జరగగా.. తాజాగా ఆమె పెళ్లి జరిగిందని అంటున్నారు. అయితే  ఆ పెళ్లి కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో డెస్టినేషన్ వెడ్డింగ్ గా జరిగిందట. ఫ్రాన్స్ లోని ప్యారిస్ సమీపంలో శ్రియాభూపాల్ - అనిందిత్ వివాహం జరిగినట్టు సమాచారం. ఈ పెళ్ళికే రామ్ చరణ్ దంపతులు హాజరయ్యారు అని తెలుస్తుంది. చాలా సింపుల్ గా జరిగిన ఆ పెళ్ళికి  కొద్దిమంది కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొనగా..అందులో రామ్ చరణ్ - ఉపాసన జంట కూడా ఉంది.

ఇక ప్రస్తుతం రంగస్థలం హిట్ తర్వాత రామ్ చరణ్ బోయపాటి సినిమా తో సెట్స్ మీదున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యనే బ్యాంకాక్ లో ఒక షెడ్యూల్ జరుపుకుని మరో షెడ్యూల్ కోసం చిత్ర బృందం హైదరాబాద్ కి వచ్చింది. ఇక రామ్ చరణ్ ఈ పెళ్లి అవగానే కొద్దిపాటి రెస్ట్ తో బోయపాటి సినిమా షూటింగ్ లో పాల్గొనున్నాడు. 

Ram Charan And Upasana At Shriya Bhupal Wedding:

Mega Power Star Ram Charan and Upasana attends Shriya Bhupal's Wedding

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ