Advertisementt

ఆ ఎన్టీఆర్ కి ఈ ఎన్టీఆర్ ఇచ్చిన నివాళి!

Wed 30th May 2018 03:48 PM
ntr birth anniversary,jr ntr,tribute  ఆ ఎన్టీఆర్ కి ఈ ఎన్టీఆర్ ఇచ్చిన నివాళి!
Jr. NTR Pay Tributes To Senior NTR On His Birth Anniversary ఆ ఎన్టీఆర్ కి ఈ ఎన్టీఆర్ ఇచ్చిన నివాళి!
Advertisement
Ads by CJ

'మీ పాదం మోపక ధరిత్రి చిన్నబోతోంది....మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది....పెద్దమనసుతో ఈ ధరిత్రిని, ఈగుండెను మరోసారి తాకిపోతాతా...సదా మీ ప్రేమకు బానిసను' అంటూ సీనియర్‌ ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇచ్చిన ప్రకటన మరోసారి ఆకట్టుకుంది. ఈ విధంగా తన తాతయ్యను తలుచుకుంటూ జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇచ్చిన భావోద్వేగమైన పోస్టర్‌ అందరినీ ఆకట్టుకుంది. 

దానిని చూసిన అభిమానుల్లో ఆనందభాష్పాలు రాలుతున్నాయి. ఎన్టీఆర్‌ జయంతిని ఘనంగా తెలుగువారందరు జరుపుకుంటున్న వేళ నందమూరి అభిమానులు ఆ పనులలో బిజీగా ఉన్న సమయంలో ఆయన రూపాన్ని పుణికిపుచ్చుకున్న ప్రియ మనవడిగా, తెలుగు సినీ వినీలాకాశంలో స్టార్‌గా ఉన్న ఎన్టీఆర్‌ తన తాతపై తనకు ఎంత అభిమానం ఉందో ఈ పోస్టర్‌ని బట్టి అర్ధమవుతోంది. 

ఇక ఇదే సమయంలో బాలకృష్ణ ఎన్టీఆర్‌ బయోపిక్‌కి సంబంధించిన చిత్రానికి తేజ స్థానంలో తన 100వ ప్రతిష్టాత్మకమైన 'గౌతమీపుత్ర శాతకర్ణి'కి దర్శకత్వం వహించిన క్రిష్‌కే ఆ బాద్యతలను అప్పగించడం విశేషం. ఎన్టీఆర్‌ బయోపిక్‌ని లేటుగా కాకుండా వచ్చే సంక్రాంతి నాటికే విడుదల చేయాలని బాలకృష్ణ తీర్మానించాడని తెలుస్తోంది. 

Jr. NTR Pay Tributes To Senior NTR On His Birth Anniversary:

Jr NTR visits NTR Ghat on NTR Birth Anniversary

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ