Advertisementt

అచ్చిరాని పాత్రలో మరోమారు మహేష్!

Thu 31st May 2018 12:47 PM
sukumar,mahesh babu,crime thriller,mahesh role  అచ్చిరాని పాత్రలో మరోమారు మహేష్!
Mahesh Babu Role in Sukumar Revealed అచ్చిరాని పాత్రలో మరోమారు మహేష్!
Advertisement
Ads by CJ

క్లాస్‌ ఆడియన్స్‌ని తప్పితే మాస్‌ ఆడియన్స్‌కి కనెక్ట్‌ అయ్యేలా సినిమాలు తీయలేడు అనే చెడ్డపేరు తెచ్చుకున్న సుకుమర్‌ 'రంగస్థలం'తో క్లాస్‌, మాస్‌ అనే తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుని అతి పెద్ద హిట్‌ని కొట్టాడు. మరోవైపు మహేష్‌బాబు రెండు వరుస డిజాస్టర్స్‌ తర్వాత 'భరత్‌ అనే నేను' చిత్రంతో హ్యాపీగా వెకేషన్స్‌ని ఎంజాయ్‌ చేస్తున్నాడు. వచ్చేనెల 9వ తేదీన హైదరాబాద్‌ రానున్న మహేష్‌బాబు వచ్చిన వెంటనే తన ప్రతిష్టాత్మక 25వ చిత్రం దిల్‌రాజు-అశ్వనీదత్‌లతో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందే చిత్రంలో పాల్గొంటాడు.

ఈ చిత్రం తర్వాత మైత్రి మూవీ మేకర్స్‌ బేనర్‌లో మహేష్‌, సుకుమార్‌ల కాంబినేషన్‌లో మరో చిత్రం రూపొందనుంది. ఇక వీరిద్దరి కలయికలో గతంలో '1' (నేనొక్కడినే) చిత్రం వచ్చింది. ఇక వీరిద్దరి మధ్య తాజాగా రానున్న చిత్రం కూడా సస్పెన్స్‌ అండ్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందనుందని సమాచారం. ఇందులో మహేష్‌ ఇన్వెస్టిగేటివ్‌ ఆఫీసర్‌గా అంటే సీబిఐ ఆఫీసర్‌గా కనిపిస్తాడని సమాచారం. ఇక '1' (నేనొక్కడినే) చిత్రం కూడా సస్పెన్స్‌ క్రైం థ్రిల్లర్‌ని పోలి ఉండే ఓ రివేంజ్‌ స్టోరీ. 

ఇక 'భరత్‌ అనే నేను' కి ముందు ఆయన చేసి 'స్పైడర్‌'లోకూడా ఆయన ఇన్వెస్టిగేటివ్‌ ఆఫీసర్‌గానే కనిపించాడు. మరి అచ్చిరాని పాత్రతో సుకుమార్‌ మరో తరహా  '1' (నేనొక్కడినే) వంటి చిత్రమే తీయడు కదా..! అనే అనుమానం సూపర్‌స్టార్‌ అభిమానులను తొలిచివేస్తోంది.

Mahesh Babu Role in Sukumar Revealed:

Sukumar to do a crime thriller movie with Mahesh Babu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ