Advertisementt

'కాలా' విడుదల తర్వాతే నిర్ణయం!

Sat 02nd Jun 2018 09:30 PM
huma qureshi,venkatesh,bobby,ks ravindra,naga chaitanya  'కాలా' విడుదల తర్వాతే నిర్ణయం!
Huma Qureshi to play the female lead opposite Venkatesh 'కాలా' విడుదల తర్వాతే నిర్ణయం!
Advertisement
Ads by CJ

రజనీకాంత్‌ నటించిన 'కాలా' చిత్రం ఈనెల 7వ తేదీన విడుదల కానుంది. ఇందులో రజనీ భార్యగా ఈశ్వరీరావు నటిస్తుండగా, ఆయన ప్రేయసిగా హ్యూమా ఖురేషి నటిస్తోంది. ఇక విషయానికి వస్తే వరుసగా చిత్రాలు చేసే విక్టరీ వెంకటేష్‌ 'గురు' చిత్రం తర్వాత చాలా గ్యాప్‌ తీసుకుని మరలా బిజీ కానున్నాడు. ఈ మద్యకాలంలో ఆయన తేజ, కిషోర్‌ తిరుమల, పూరీజగన్నాధ్‌ వంటి పలువురితో నటిస్తాడని వార్తలు వచ్చినా అవి పట్టాలెక్కలేదు. ఇక తాజాగా వెంకీ ఒప్పుకున్న రెండు చిత్రాలలో ఆయన యంగ్‌ హీరోలతో కలిసి నటించనున్నాడు. 

దిల్‌రాజు నిర్మాణంలో వెంకటేష్‌, మెగా హీరో వరుణ్‌తేజ్‌లు హీరోలుగా హ్యాట్రిక్‌ చిత్రాల దర్శకుడు అనిల్‌రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్‌2' చిత్రం రూపొందనుంది. 'ఫన్‌ అండ్‌ ఫస్ట్రేషన్‌' అనేది ఉపశీర్షిక. దీని వెంటనే ఆయన తన సొంత మేనల్లుడు నాగచైతన్యతో కలిసి 'జైలవకుశ'వంటి హిట్‌ ఇచ్చిన దర్శకుడు కె.ఎస్‌.రవీంద్ర అలియాస్‌ బాబి దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ఇందులో వెంకటేష్‌, నాగచైతన్యలు వెండితెరపై కూడా మేనమామ-మేనల్లుళ్లుగా నటించనున్నారు. 

ఇక ఇందులో వెంకటేష్‌ సరసన ఆయనకు సరైన జోడీ కోసం వెతుకుతున్నారు. మొదట్లో నయనతార పేరు వినిపించినప్పటికీ ఇప్పుడు మాత్రం 'కాలా'లో రజనీకాంత్‌ ప్రేయసిగా నటించిన హ్యూమా ఖురేషీతో జతకట్టనున్నాడని ప్రచారం జరుగుతోంది. మరి 'కాలా' విడుదలై హ్యూమా ఖురేషి ఎంత వరకు మెప్పించింది అనే పాయింట్‌ ఆధారంగానే ఆమెకి వెంకీ చిత్రంలో అవకాశం ఆధారపడి ఉందని చెప్పాలి. 

Huma Qureshi to play the female lead opposite Venkatesh:

Huma Qureshi To Star Reverse Venkatesh In Her First Telugu Movie?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ