గతంలో ఐస్ బకెట్ ఛాలెంజ్ లాగా ఇప్పుడు ఫిట్నెస్ ఛాలెంజ్ ఒకటి ఇండియా మొత్తం వైరల్ అవుతుంది. 'హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్' పేరుతో కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ స్టార్ట్ చేసిన ఈ చైన్ లింక్ ప్రాసెస్ లో.. ఫిట్నెస్ ఛాలెంజ్ లోకి మలయాళం నటుడు మోహన్ లాల్ రాగా.. అతను ఆ ఛాలెంజ్ ని స్వీకరించి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఛాలెంజ్ విసిరాడు.
అందుకు గాను ఎన్టీఆర్ జిమ్‌లో వ్యాయామం చేస్తూ తీసుకున్న వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి... మహేష్ బాబు, నందమూరి కల్యాణ్ రామ్, రామ్ చరణ్, రాజమౌళి, కొరటాల శివకు ఛాలెంజ్ విసిరిన సంగతి తెలిసిందే. వారిలో ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ ముందుగా ఎన్టీఆర్ ఛాలెంజ్ స్వీకరిస్తూ నిన్న జిమ్‌లో వ్యాయామం చేశాడు.
హీరో కళ్యాణ్ రామ్... యంగ్ హీరోలు అల్లు అర్జున్, రామ్, సాయి ధరమ్ తేజ్‌లకు కళ్యాణ్ రామ్ ఛాలెంజ్ విసిరాడు. మరోవైపు నాగార్జున లేటెస్ట్ గా అఖిల్ ఛాలెంజ్ ని స్వీకరిస్తూ...హీరో నానికి ఛాలెంజ్ విసరగా అందుకు గాను నాని స్పందించి, 'చచ్చాను' అంటూ సరదాగా రిప్లై ఇచ్చాడు.