Advertisementt

చిరు, కొరటాల మూవీ ఈ అప్‌డేట్ విన్నారా?

Tue 05th Jun 2018 02:45 PM
megastar chiranjeevi,koratala siva,next movie,chiranjeevi,dual role  చిరు, కొరటాల మూవీ ఈ అప్‌డేట్ విన్నారా?
Chiranjeevi Playing Dual Role in Koratala Siva Film చిరు, కొరటాల మూవీ ఈ అప్‌డేట్ విన్నారా?
Advertisement
Ads by CJ

చాలాకాలం గ్యాప్ తీసుకుని 2016 లో ఖైదీ నెంబర్ 150 సినిమా ద్వారా మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ కు రీఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాకు మంచి టాక్ వచ్చి భారీ కలెక్షన్స్ రావడంతో చిరు తర్వాత చేసే చిత్రంపై అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. యంగ్ డైరెక్టర్ సురేంద్ర రెడ్డి డైరెక్షన్ లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న 'సైరా' చిత్రం చేస్తున్నాడు.

మరోపక్క ఈ సినిమా షూటింగ్ దశలోనే ఉండగా చిరు తన తర్వాత సినిమా కూడా ఫిక్స్ చేసుకున్నట్టు సమాచారం. కొరటాల డైరెక్షన్ లో ఓ సినిమా చేయడానికి మెగాస్టార్ చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. 'భరత్ అనే నేను' సూపర్ హిట్ చిత్రం తర్వాత కొరటాల చిరుతో చేస్తున్న చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు.

సినిమాపై అంచనాలు పెరగడంతో ఈ సినిమాకు సంబంధించి కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. అందులో భాగంగా ఈ సినిమాలో చిరు డ్యూయల్ రోల్ చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. చిరు పోషిస్తున్న రెండు పాత్రల్లో ఒకటి చిన్న గ్రామంలో పొలం పనులు చేసుకునే పాత్ర కాగా రెండవది ఎన్ ఆర్ ఐ మిలియనీర్ పాత్ర. ఈ వార్త నిజమైతే చిరు ఫ్యాన్స్ కి ఐ ఫీస్ట్ అనే చెప్పాలి. ఖైదీ  నెం.150 తర్వాత మళ్లీ వెంటనే చిరు ఇలా డ్యూయల్ రోల్ చేయాలని నిర్ణయించుకోవడంతో అందరిలోనూ ఆసక్తి నెలకుంది. అయితే ఈ సినిమాపై అధికార ప్రకటన రావాల్సిఉంది.

Chiranjeevi Playing Dual Role in Koratala Siva Film:

Megastar chiranjeevi to be seen in a Dual Role

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ