తమకు అలవాటు ఉన్న లేకపోయినా ఏదైనా బ్రాండ్‌కి అంబాసిడర్‌గా పనిచేసే అవకాశం వస్తే నటీనటులు ముందు వెనుకా చూడకుండా ఓకే అంటారు. తాము వాడని, సమాజానికి చెడు చేసే ఉత్పత్తులకు, మద్యానికి కూడా ప్రకటనలు చేస్తూ ఉంటారు. ఇక థమ్సస్, కోకకోలా, పెప్సీ వంటి చెడు ప్రభావం చూపే యాడ్స్‌లో నటిస్తూ, తాము మాత్రం వాటిజోలికి పోకుండా కొబ్బరిబోండాలు, ఫ్రూట్ జ్యూస్‌లు తాగుతుంటారు. ఇలాంటి వారికి బిగ్‌బి చెంపపెట్టు వంటి మాటలు చెప్పాడు.
తాను ఏ ఉత్పత్తినైతే వాడుతానో, తనకు ఏ ఉత్పత్తి మంచిది అనిపిస్తే దానికే ప్రచారకర్తగా పనిచేస్తానని, తనకు అలవాటు లేని పొగాకు, మద్యం వంటి బ్రాండ్లకు కోట్లు ఇచ్చినా తాను పనిచేసే ప్రశ్నే లేదని తేల్చిచెప్పాడు. నేనే ఈ ఉత్పత్తిని తయారు చేయడం చూశాను. అద్భుతమైన ఘఢీ అంటూ ఘంటాబేధం లేకుండా నేను వాడని ఉత్పత్తులను జీవితంలో ప్రమోట్ చేసే ప్రశ్నేలేదని ప్రకటించిన అమితాబ్‌ని మిగిలిన హీరోలు స్ఫూర్తిగా తీసుకోవాలనే చెప్పాలి.
ఇక ఈ వయసులో కూడా అమితాబ్ ఎంతో యాక్టివ్‌గా ఇటు సినిమాలు, అటు ప్రకటనలతో దూసుకెళ్తున్నాడు. అమీర్ నటిస్తున్న 'థగ్స్ ఆఫ్ హిందుస్తాన్', చిరంజీవి 'సైరా'లతో పాటు మరో చిత్రంలో కూడా నటిస్తున్నాడు.